ఈ మధ్యకాలంలో టీ , కాఫీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అని చెప్పాలి. ఒత్తిడితో కూడుకున్న జీవితంలో కాస్త ఉపశమనాన్ని కలిగించే ఒక అమృతాం లాగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది టీ, కాఫీ కి బాగా అలవాటు పడిపోయారు. ఉదయం లేచిన దగ్గరనుంచి సాయంత్రం పడుకునేంతవరకు కూడా ఒకటి కాదు రెండు మూడు సార్లు టీ తాగే అలవాటు చేసుకున్నారు ఎంతోమంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బయట ఉన్న టీ కాఫీ షాపులకి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. అంతేకాదు ఇక టీ కాఫీ షాప్ నిర్వాహకులు కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు అని చెప్పాలి.


 రకరకాల ఫ్లేవర్లతో టీ కాఫీలు తయారు చేస్తూ ఇక బిజినెస్ ని బాగా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంబీఏ చాయ్ వాలా,  గ్రాడ్యుయేట్ చాయివాలా అంటూ విభిన్నమైన పేర్లతో కస్టమర్లను ఆకర్షించడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఒకప్పుడు ఛాయ్ వాలా అంటే ఒక చిరు వ్యాపారి అని మాత్రమే అందరూ అనుకునేవారు. కానీ ఏకంగా  కారులో వచ్చి టి అమ్మే వ్యక్తులను ఎప్పుడైనా చూశారా అంటే ఎవరైనాసరే చూడలేదు అని చెబుతారు. అయినా కార్లో వచ్చి ఎవరు టీ అమ్ముతారు చెప్పండి అని మనల్ని తిరిగి ప్రశ్నిస్తారు. కానీ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఇలాంటిదే చేస్తున్నారు.



 ముంబై కి చెందిన అమిత్ కశ్యప్, మనుష్ శర్మ అనే ఇద్దరు స్నేహితులు ఆడి కార్లో వచ్చి టీ అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. లోకండ్ వాలా బ్యాక్ రోడ్ లో ప్రతిరోజు వీరు ఆడి కార్లో వచ్చి రోడ్డు పక్కనే టీ షాప్ ను ఏర్పాటు చేస్తున్నారు. దారిన పోయే చాలామంది ఇక్కడ టీ తాగి వెళ్తూ ఉండడం గమనార్హం.  అయితే ఇక అందరిలాగానే అక్కడికి వెళ్లిన ఒక కస్టమర్ అక్కడ ఆడి కార్లో వచ్చి టీ అమ్మడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇదంతా వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈ వీడియోపై ఎంతోమంది భిన్నమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: