ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ని చేయడం ద్వారా మీరు ఇంటి వద్దనే ఉండి ప్రతినెల వేలల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.ఇక ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు అదేవిధంగా ఫంక్షన్లలో బ్లౌజులపై మగ్గం వర్క్ చేయించడం అనేది చాలా కామన్ గా మారింది. అయితే ఈ మగ్గం వర్క్ అనేది చాలా కాస్ట్లీ అని అంటూ ఉంటారు. నిజానికి ఈ మగ్గం వర్క్ ని నార్త్ ఇండియాలో జర్దోసి వర్క్ అని అంటారు. అంటే మగ్గంపై క్లాత్ ను వత్తి పట్టి దానిపై జర్దోసి తరహాలో రంగురంగు దారాలని ఉపయోగించి డిజైన్స్ చేస్తూ ఉంటారు. దీన్నే జర్దోసి వర్క్ లేదా మగ్గం వర్క్ అని కూడా అంటారు. పెళ్లి ఫంక్షన్లలో పట్టుచీరలపై ఉపయోగించే బ్లౌజులలో ఈ మగ్గం వర్క్ ని కూడా మనం గమనించవచ్చు.ఇక ఈ మగ్గం వర్క్ ని నేర్చుకోవడం ద్వారా కూడా మీరు ఈజీగా ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. నిజానికి మగ్గం వర్క్ లేదా జర్దోసి వర్క్ ఉత్తర భారత దేశానికి చెందిన కళాకారులకు చాలా బాగా వస్తుంది.


మన  రాష్ట్రంలో కూడా ఉత్తర ప్రదేశ్, బీహార్ ఇంకా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన పనివారితో ఈ మగ్గం వర్క్ ని చేయిస్తూ ఉంటారు. కానీ స్థానికంగా కూడా మీరు దీనిని శ్రద్ధగా నేర్చుకుంటే ఖచ్చితంగా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.అయితే మీరు కూడా మగ్గం వర్క్ నేర్చుకోవాలని భావిస్తూ ఉంటే  ప్రస్తుతం మార్కెట్లో కొన్ని ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో ఈ మగ్గం వర్క్ ను నేర్పిస్తూ ఉన్నాయి. ఇంకా అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెట్విన్ సంస్థ అయితే అతి తక్కువ ధరకే ఈ జర్దోసి డిజైనింగ్ కోర్సును ఆఫర్ చేస్తుంది. కేవలం 1500 రూపాయలకే ఈ కోర్సులని ఆఫర్ చేస్తున్నారు. ఇంకా అంతే కాదు సర్టిఫికెట్ కూడా జారీచేస్తారు. ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీరు సొంతంగా కూడా మగ్గం వర్క్స్ ని స్టార్ట్ చేయవచ్చు.మగ్గం వర్క్ ద్వారా మీరు పెద్ద ఎత్తున ఆర్డర్లని పొందాలి అనుకుంటే ఫ్యాషన్ డిజైనర్లతో ఒప్పందం చేసుకుంటే చాలా మంచిది. ఇక అప్పుడు మీకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: