సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలోకి తీసుకువచ్చింది ఇందిరాగాంధీ అని తెలుస్తుంది. ఇందిరాగాంధీ టైంలో పాకిస్తాన్ పై యుద్ధం చేసి గొప్ప విజయాన్ని సాధించడం ఆవిడ సాధించిన క్రెడిట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. అయితే అదే ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధానాన్ని అమలు చేసి దేశ ప్రజలందరినీ నిర్బంధించే పరిస్థితి తీసుకు వచ్చింది. దాంతో ఇందిరాగాంధీ తన క్రెడిట్ ను అంతా కోల్పోయి ఓడిపోయే దిశగా వచ్చే టైం లో ఈ సెక్యులర్ అనే పదాన్ని ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది.


ఇక్కడ భారతదేశం మత ప్రాతిపదిక దేశం కాకపోయినా, ఈ సెక్యులర్ అనే పదం రాజ్యాంగ సవరణ చేసి మరి యాడ్ చేశారు అప్పుడు. కానీ ఆ సెక్యులర్ అనే పదం పై ఎప్పుడు చర్చ వచ్చినా కూడా పెద్ద రచ్చ జరుగుతూ ఉంటుంది. కానీ చైనా మొదటి నుంచి కమ్యూనిజం, సామ్యవాదం పునాదులుగా చేసుకుని పుట్టిన దేశం. పెట్టుబడిదారులను, పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించే దేశం. కానీ ఇప్పుడు చైనా దానికి వ్యతిరేకంగా చేస్తున్నట్లుగా తెలుస్తుంది.


ప్రపంచంలోని పెట్టుబడిదారులను అందర్నీ తీసుకొచ్చి చైనాలో పెట్టుకుంటుంది. అందుకే అక్కడ కూడా ప్రైవేట్ కంపెనీలు, అందులో ప్రైవేట్ జాబులు అనేవి ఉంటున్నాయి ఇప్పుడు. రష్యాలో ఇదివరకు అన్నీ ప్రభుత్వ రంగ సంస్థలే కానీ, ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థలను అనుమతించింది. అంతే కాకుండా యూరప్ దేశాలకు సంబంధించిన పెట్టుబడిదారులను కూడా ఆహ్వానించింది ఆ రకంగా.


దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉండాలి, ప్రైవేట్ రంగ సంస్థలు ఉండకూడదు అనే వాదం తప్పని తేలింది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతమే తప్పని వాళ్లకి అర్థమయింది అని వాళ్ళు అంటున్నారు. ప్రైవేట్ రంగం ఇంకా ప్రభుత్వ రంగ రెండు పోటా పోటీగా ఉండాలి తప్పించి కేవలం ప్రైవేట్ రంగమో లేదంటే ప్రభుత్వ రంగమో మాత్రమే ఉండటం కరెక్ట్ కాదని అంటున్నారు వాళ్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: