సాఫ్ట్ వేర్ హబ్ గా విశాఖ పట్నం ఉంది. కానీ ఈ హబ్ ని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని గతంలో చాలా ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా దీన్ని తరలించాలని ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా గన్నవరంలో రెండు బిల్డింగ్ లు నిర్మించారు. కానీ అందులో పెద్ద పెద్ద సాప్ట్ వేర్ కంపెనీలు కాకుండా కేవలం కాల్ సెంటర్లు మాత్రమే నడిపించారు. మిగతావి రాలేవు. అదే సందర్భంలో విశాఖలోని రుషి కొండ ప్రాంతంలో కొన్ని సాప్ట్ వేర్ కంపెనీలు వచ్చాయి. అయితే హైదరాబాద్ కు ఇచ్చిన ప్రయార్టీ ఇక్కడ ఇవ్వకపోవడం సెకండ్ ప్రయార్టీ కింద ఉండడంతో అలాగే ఆగిపోయాయి.


మళ్లీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో సాప్ట్ వేర్ కంపెనీలు తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ కాల్ సెంటర్ల తరహా తప్పించి పెద్దగా కంపెనీలు రావడానికి మొగ్గు చూపలేదు. ప్రస్తుతం విశాఖ పట్నంలోకి ఇన్పోసిస్ లాంటి పెద్ద కంపెనీలు రావడానికి తయారవుతున్నాయి. అయితే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం తరఫున ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సాప్ట్ వేర్ పార్కులు ప్రారంభించేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పారు. దీనికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి  రాజీవ్ చంద్రశేఖర్ సమాధానమిస్తూ ఆంధ్రలో నాలుగు సాప్ట్ వేర్ పార్కులు తీసుకురానున్నట్లు చెప్పారు.


అందులో ఒకటి కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖ పట్నం లాంటి చోట్ల పెట్టడానికి సిద్ధమని తెలియజేశారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వాటిని ప్రారంభించడానికి విధి విధానాలు తయారు చేస్తున్నామని అన్నారు. దీంతో విభజన జరిగిన నాటి నుంచి నాలుగు సాప్ట్ వేర్ పార్కులు రానున్నాయి. దీంతో చాలా మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. ఉద్యోగాలతో ఎంతో మందికి ఉపాధి దొరకడమే కాకుండా ఆయా పట్టణాలు డెవలప్ మెంట్ అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: