అదానీ సంస్థలపై మళ్లీ కుట్ర మొదలైంది. గతంలో హిండెన్ బర్గ్ నివేదిక బయటపెడితే ఇప్పుడు ఓసీసీఆర్పీ అనే సంస్థ.. అదే పాట పాడుతోంది. ముందుగానే షార్ట్ సెల్లింగ్ కు రెడీ చేసుకుని ఆ తర్వాత అదానీ కంపెనీలను దెబ్బతీయాలని ప్రయత్నం చేశారని.. ఇదే విషయాన్ని తాజాగా సెబీ బయటపెట్టిందని.. అదానీ గ్రూపు లిస్ట్ డ్ కంపెనీల షేర్లలో షార్ట్ సేలింగ్స్ ముమ్మాటీకి నిజమని ఆ నివేదికలు చెబుతున్నాయి.


తాజాగా ఎన్ పోర్స్ మెంట్ దాడుల్లో దీనికి సంబంధించి ఆధారాలు లభించినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ అనే ఆంగ్ల పత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ షార్ట్ సెల్లింగ్ దందా ద్వారా విదేశీ పోర్టు పోలియో ఇన్వెస్టర్లు 12 కంపెనీల వారు లబ్ధి చెందినట్లు తెలిసింది. ఈడీ ఈ వివరాలను గత నెలలో సెబీకి కూడా అందజేసినట్లు తెలిసింది. భారత్ కు చెందిన మూడు సంస్థలు, నాలుగు మార్షల్స్ కు చెందిన నాలుగు ఎఫ్ డీ ఐలు అయితే అదానీ కంపెనీ లిస్ట్ డ్ కంపెనీ షేర్లలో కొనుగోలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖకు కూడా తెలియజేయలేదు.


అదానీ గ్రూపు షేర్లలో పెద్ద దందా జరుగుతున్నట్లు అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ జనవరి 26 న వెల్లడిస్తే అయితే ఈ 12 సంస్థల్లో కొన్ని హిండెన్ బర్గ్ నివేదిక వెలువడడానికి 2 నుంచి 3 రోజుల ముందే షార్ట్ పొజిషన్ లు తీసుకున్నాయి. అయితే కొన్ని సంస్థలు షార్ట్ పొజిషన్ల మీద ఎలాంటి అనుభవం లేకపోయినా షార్ట్ పొజిషన్లు తీసుకోవడం వెనక దీని వెనక బలమైన కుట్ర దాగుందని అర్థం అవుతుంది. అయితే ఈ సంస్థలకు హిండెన్ బర్గ్ నివేదిక ముందే రాబోతుందని వీరికి కచ్చితంగా తెలిసే ఉండాలి. అదానీనే ఈ పని చేశాడని ప్రొజెక్టు చేస్తున్నారు.  అయితే ఇదంతా కావాలనే పక్కా ప్లాన్ తో చేసినట్లు మాత్రం అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: