అనంతపూర్ జిల్లాలో చంద్రబాబు హయాంలో కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చారు. వెనుకబడిన జిల్లాగా దేశంలోనే అత్యంత కరువు ఉన్న రెండో జిల్లాగా అనంతపూర్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ కియా ఫ్యాక్టరీ తీసుకురావడం వల్ల దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల రేట్లకు ఇప్పుడు ధరలు వస్తున్నాయి. అయితే అనంతపురంలో భూములు కొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతానికి చెందినటువంటి వ్యాపారులు పోటీపడుతున్నారు.


ముఖ్యంగా అనంతపురం, తాడిపత్రి, పుట్టపర్తి, హిందూపురం లాంటి చోట్ల ఎక్కువగా భూములకు ధరలు వస్తున్నాయి. గతంలో ఇక్కడ భూములు కొనేందుకు ఎవరు ఆసక్తి చూపలేరు. ఇప్పుడు మెల్లగా కోలుకొని భూముల ధరలు పెరుగుతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరుకు చెందినటువంటి వ్యాపారులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సత్యసాయి జిల్లా చిలమత్తూరు గోరంట్ల మండల కేంద్రాల్లో భూములు కొనేందుకు ఆసక్తి  చూపుతున్నారు. ఆ భూముల్లో అక్కడ చెట్లను నాటి ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తున్నారు. వెంచర్లను వేస్తున్నారు.


దీని వల్ల అక్కడ ఉండే రైతులకు ఉపాధి కూడా దొరుకుతుంది. అదే సమయంలో కొన్న భూముల్లో సైతం అక్కడ చెట్లను పెంచు తున్నారు. ముఖ్యంగా కర్ణాటకకు చెందినటువంటి రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు అనంతపురంని భూములు కొనేందుకు కేంద్రంగా ఎంచుకుంటున్నారు. కారణం వచ్చే  రోజుల్లో అక్కడ మరిన్ని పరిశ్రమల ఏర్పాటు కు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది అనంతపురంలో పెరగడంతో అక్కడ ఉండే సామాన్యులకు ఉపాధి దొరుకుతుంది.


ఇది ఒక రకంగా మంచిదే. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది. తద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. భూమి అనేది పెరగకపోవచ్చు. కానీ భూమి ధర అనేది పెరుగుతుంది. తద్వారా ఆ ప్రాంతం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: