భారతదేశ  వజ్ర వ్యాపారం పై  ప్రస్తుత పరిస్థితుల్లో దెబ్బ పడేలా ఉంది. ముఖ్యంగా రష్యా  ఉక్రెయిన్ యుద్దం తర్వాత రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని రష్యా వజ్ర వ్యాపారాలపై నిషేధం విధించాలని జీ 7 దేశాలు యూరోపియన్ యూనియన్ దేశాలు అనుకుంటున్నాయి.  ఈ సందర్భంగా రాబోయే జీ 7 సదస్సులో ఈ దేశాలు రష్యా వజ్ర వ్యాపారంపై నిషేధం విధిస్తే అది భారత్లో ఉండే వజ్ర వ్యాపారులకు కూడా ముఖ్యంగా భారతదేశంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. భారత్  వజ్రాల వ్యాపారం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. బంగారంతో పోలిస్తే వజ్ర వ్యాపారము కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.


ఇక బంగారం రేటు ప్రతి షాపులో కూడా ఒకే విధంగా ఒకే రేటులో ఉంటాయి. కేవలం తయారీ విధానంలో మాత్రమే తేడా ఉంటుంది. అది కూడా పెద్ద తేడాలో ఉండకూడదు. కానీ వజ్ర వ్యాపారంలో తేడాలు బీభత్సంగా ఉంటాయి. వజ్రాల యొక్క రంగు రాళ్ళ తదితర అంశాలను బట్టి వజ్రాలు రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే రష్యా ను ఈ విధంగా కూడా దెబ్బతీయాలని యూరోపియన్ దేశాలు జి సెవన్ దేశాలు భావిస్తున్నాయి.


భారత్ లో  డైమండ్ ల  వ్యాపారానికి గుజరాత్ లోని ప్రధాన పట్టణాలు ఫేమ్. రష్యా నుంచి ఇండియాకు ముడిసరకు వస్తుంది. దాని నుంచి ఇక్కడ విలువైన వజ్రాలను తయారు చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో ఈ  వ్యాపారం ఇపుడు దెబ్బ తినేలా ఉంది. సూరత్ లాంటి నగరాల్లో ప్రముఖంగా వజ్రాల వ్యాపారం చేస్తుంటారు భారతదేశంలో ఎక్కడ లేని వ్యాపారం ఈ పట్టణంలో కొనసాగుతుంది కానీ యూరప్ దేశాలు నాటో దేశాలు తీసుకున్న ఈ నిర్ణయంతో వజ్ర వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు  రాబోయే రోజుల్లో వజ్రాల వ్యాపారానికి ఏ విధమైన ప్రతికూలతలు ఏర్పడతాయని ఆలోచిస్తున్నారు. మరి ఈ వ్యాపారుల భవిష్యత్‌ ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: