వందే భారత్ లాగా వందే సాధారణ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వందే భారత్ లో అత్యంత అధునాతనమైన సదుపాయాలతో అతి వేగంగా దూర ప్రయాణాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ వందే భారత్ లో టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల సామాన్య ప్రజలు అందులో ప్రయాణించలేకపోతున్నారు.


చాలా మటుకు డబ్బులు ఎక్కువగా ఉన్న వ్యక్తులు మాత్రమే వందే భారత రైలులో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరో ఆలోచన చేసి వందే భారత్ సాధారణ అనే రైలు ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యమని దీని ద్వారా అర్థమవుతుంది. మందే భారత ఎక్స్ప్రెస్ వల్ల సామాన్య ప్రజలు దూర ప్రాంతాలను తొందరగా చేరుకోలేకపోతున్నారు. ఎందుకంటే అందులో ఒక్కో టికెట్ ధర దాదాపు విమానాల్లో ఉన్నంత ఉండడం వల్ల సామాన్య ప్రజలను వాటిని ఎక్కలేకపోతున్నారు.


దీనిపైన ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది. వందే భారత ఎక్స్‌ప్రెస్‌ అనే వాదనలు వినిపించాయి. దీని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సరైన మార్గాలను అన్వేషించాలని అనుకుంది. వందే సాధారణ ఎక్స్‌ ప్రెస్‌ ద్వారా సామాన్య ప్రజలకు కూడా వేగంగా సులభంగా దూర ప్రాంతాలను చేరుకునే విధంగా సరికొత్త రైళ్ల ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, మమత బెనర్జీ  రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు గరీబ్ రథ్  ఎక్స్‌ ప్రెస్‌ తీసుకువచ్చారు.


గరీబ్ ఎక్స్‌ప్రెస్‌ వల్ల సామాన్య ప్రజలు రైళ్ల లో అతి తక్కువ ధరతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించడం అనేది వారు తీసుకొచ్చిన ఫలితంగానే అని చెప్పొచ్చు.  వందే సాధారణ రైలు కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తే వేగంగా సులభంగా గమ్యస్థానం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: