విజన్ అంటే రేపటిపై ఆలోచన, ఎల్లుండిపై దృష్టి, భవిష్యత్తు తరాలపై అవగాహన కలిగి ఉండాలి. అంతేకానీ అభివృద్ధి చెందిన ప్రాంతానికి మన బొమ్మ వేసుకోవడం ఏది జరిగినా నా వల్లే అని గొప్పలు చెప్పుకోవడం కాదు. విజన్ కు అసలు సూత్రధారి అటల్ బిహరీ వాచ్పేయీ. దేశంలో స్వర్ణ చతుర్భుజి అనే ఎక్స్ ప్రెస్ హైవేల ప్రారంభం ఆయన చేయకపోతే ఈనాడు  ఇంత అభివృద్ధి ఉండేదా.


అప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడం  ప్రారంభించింది. రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టి మౌలిక వసతుల కల్పన జరిగింది. ఆ తర్వాత ఆ విజన్ ను మనం పక్కన పెట్టేశాం.  అదే సందర్భంలో నరేంద్ర మోదీ వచ్చాక తీసుకొచ్చిన కీలక సంస్కరణ జీఎస్టీ. వస్తువు ఉత్పత్తి అయిన దగ్గర నుంచి కొనేవారి వరకు ప్రతిచోట పన్ను వసూలు చేస్తూనే ఉన్నారు.  నోట్లు రద్దు చేపట్టి డబ్బును నల్లధనంగా మార్చే అవకాశాన్ని మూసేశారు.  


గతంలో లక్షల్లో అంటే 88 లక్షల ఇన్ కాం ట్యాక్స్ కట్టేవారు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య ఆరున్నర కోట్లకు చేరింది. లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. డిజిటల్ ఇండియా పేరుతో ప్రతి ఒక్కరూ చివరకు భిక్షాటన చేసే వారు కూడా క్యూ ఆర్ కోడ్ వాడుతున్నారు.  ఇది విజన్ అంటే.


మరో వైపు ప్రైవేటు సంస్థల ద్వారా ఎక్కడెక్కడ ఏయే గనులున్నాయి తెలుసుకొని భవిష్యత్తులో ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  భారత్ లో పెట్టుబడులు పెట్టేందుక మార్గం సుగమం చేస్తూ సెమీ కండక్టర్, ఆయుధ తయారీ వంటి పరిశ్రమలను తీసుకువచ్చి ఉపాధి కల్పనతో పాటు ఆదాయం పెంచేలా కృషి చేస్తున్నారు. డాలర్ ను వదిలి రూపాయి వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దిర్హాంలో మనం ఇస్తే రూపాయల్లో వాళ్లు ఇస్తారు. మనం  రూపాయల్లో వాళ్లకు ఇచ్చేలా 22 దేశాలతో చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఆ దేశాలు పోటీపడి రిజర్వ్ బ్యాంకుతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇది జరిగితే డాలర్ ఆధిపత్యం భారత్‌లోలో తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: