తక్కువ వేతనంతో ఉద్యోగాలు చేసేవారు భారతీయులే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో భారతీయులు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఆసియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ దేశాల్లో ఇండియా వాసులు ఉన్నారు. ప్రతి రంగంలో ఏదో ఒక చోట ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇండియా లో తక్కువ జీతంకు పని చేసేవారు. అదే పని వేరే దేశంలో చేస్తే ఎక్కువ డబ్బులు రావడంతో అక్కడ పని చేసేందుకు మక్కువ చూపుతున్నారు.


ప్రస్తుతం ప్రపంచ బ్యాంకులో పని చేస్తున్న వారు ఎక్కువ మంది ఇండియా వారే ఉన్నారని ఒక నివేదిక ద్వారా తెలిసింది. ప్రపంచ దేశాలకు అప్పులిచ్చే బ్యాంకులో కూడా ఇండియాకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారంటే దేశంలోని యువత ఎంతలా విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ బ్యాంకులో కీలక పదవుల్లో ఇండియాకు చెందిన వారే ఉన్నారు. అజయ్ బంగా ఈ మధ్యే ప్రపంచ బ్యాంకులో ప్రధాన ఉద్యోగిగా ఎన్నికయ్యారు.


దీనికి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలుస్తోంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అన్షుమల్ కాంత్, చీఫ్ ఎకానమిస్ట్ ఇంద్రనీత్, బ్యాంక్ చీప్ రిస్క్ ఆఫీసర్ లక్ష్మీ శ్యాం సుందర్ అనే మహిళ, పరమేశ్వరన్ అయ్యర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా భారతీయుడే ఉన్నారు. అయితే ప్రపంచ బ్యాంకులో ఉన్న భారతీయుల్లో ఎక్కువ మంది ప్రధాన శాఖల్లో పని చేయడం అనేది ఆశించదగిన పరిణామమే. కానీ వీరందరూ కలిసి భారత్ ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తారనేది చూడాలి. ఇప్పటి వరకు ఇండియాకు ఎలాంటి సాయం అందించారు. ఏం సాయం చేయాలనుకుంటున్నారు.


అయితే భారత్ నుంచి విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకుని ఇలాంటి ఉన్నత ఉద్యోగాల్లో చేరడం అనేది చాలా శుభపరిణామం. ఎప్పుడైనా దేశంలో ఆర్థిక పరిస్థితులు తలకిందులైనా ప్రపంచ బ్యాంకులో మనోళ్లే ఉన్నారని ధీమాగా ఉండొచ్చనే వాదన కూడా కొంతమందిలో వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: