
నరేంద్ర మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచెలంచెలుగా వృద్ధి చెందుతోంది. అందులో గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ వంటి వ్యాపార వేత్తల భాగస్వామ్యం కీలకం. అయితే భారత ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చేందుకు అంబానీ, అదానీ లను లక్ష్యంగా చేసుకొని వాళ్ల ను దెబ్బకొట్టేందుకు 2018 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఎందుకంటే భారత్ టాప్ 5 ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తే మన దేశ ఆర్థిక వేత్తల ఉన్నతి, ఉపాధి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. దీంతో పాటు అంతర్జాతీయంగా ఇండియా పరపతి పెరుగుతుంది.
గతంలో రాఫెల్ వంటి దేశ రక్షణకు సంబంధించిన అంశాలను అడ్డుపెట్టుకుని అంబానీను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించారు. కానీ వీటిని తట్టుకొని అంబానీ నిలబడ్డారు. ప్రపంచ కుబేరుడిగా ఎదుగుతున్న గౌతమ్ అదానీని దెబ్బతీసేందుకు హిండెన్స్ బర్గ్ నివేదికను తీసుకువచ్చారన్న ఆరోపణలున్నాయి. దీంతో అతని ఆస్తులు మంచుకొండల్లా కరిగిపోయాయి. దీనిని సైతం తట్టుకుని అదానీ నిలబడిగలిగారు.
తాజాగా ప్రముఖ రీసెర్ఛ్ సంస్థ హురూన్ ఇండియా సంపన్నుల జాబితాను విడుదల చేసింది. రూ.8.08లక్షల కోట్లతో ముకేశ్ అంబానీ తొలిస్థానంలో కొనసాగుతున్నారు. అటు మరో దిగ్గజం గౌతమ్ అదానీ రూ.4.74 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. గతంలో పోల్చితే ఆయన సంపద 57శాతం కరిగిపోయింది. దీనికి హిండెన్స్ బర్గ్ ఇచ్చిన నివేదికే కారణంగా తెలుస్తోంది. గతేడాది అంబానీ కంటే అదానీ రూ.3లక్షల కోట్లతో సంపన్నుడిగా కొనసాగాడు. తాజాగా అంబానీ అదానీ ఆస్తుల కంటే రూ.3.3 లక్షల కోట్లు అధికంగా కలిగి ఉన్నారు.