ఇక ఇలాంటి ఆఫర్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంటే.. ఇటీవల ఒక రెస్టారెంట్ కేవలం రెండు రూపాయలకే బిర్యానీ అందిస్తుంది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. ఈ ఆఫర్ బాగా ఆకర్షణీయంగా ఉంది కదా. ఇది ఎక్కడో కాదు హైదరాబాదులోనే. నాయుడుగారి కుండ బిర్యాని అనే రెస్టారెంట్లో రెండు రూపాయలకే బిర్యానీ అందిస్తున్నారు. రెండు రూపాయలకేనా.. వెంటనే వెళ్లి తినాలి అని సంబరపడిపోకండి. ఎందుకంటే రెండు రూపాయల బిర్యాని విషయంలో యాజమాన్యం ఒక కండిషన్ పెట్టింది.
ప్రస్తుతం రెస్టారెంట్ నిర్వాహకులు పెట్టిన రెండు రూపాయల బిర్యాని తినాలి అంటే ఇక రెండు రూపాయల నోటు మాత్రమే చెల్లించాలి. ప్రస్తుతం రెండు రూపాయల నోటు చలామణిలో ఉందో లేదో తనిఖీ చేసేందుకు హోటల్ యాజమాన్యం ఈ వినూతమైన ఆఫర్ ప్రకటించగా.. ఇక ఈ ఆఫర్ ఆ రెస్టారెంట్ కు మంచి గుర్తింపును కూడా తీసుకువచ్చింది అని చెప్పాలి. అయితే ఇప్పటికే వందమందికి పైగా ఆహార ప్రియులు ఈ ఆఫర్ నీ ఆస్వాదించారట. కాగా ఈ రెస్టారెంట్ హైదరాబాద్ లోని కెపిహెచ్బి గచ్చిబౌలి దిల్సుఖ్నగర్ లో శాఖలు ఉన్నాయి. కానీ కూకట్పల్లి లో మాత్రమే ప్రత్యేకంగా ఈ బిర్యానీ అందుబాటులో ఉంది. అయితే గతంలోనూ బాహుబలి తాళి లాంటి ఆఫర్లు ప్రకటించి వార్తల్లో నిలిచింది ఈ రెస్టారెంట్.