సక్సెస్ ఎవరి సొత్తు కాదు.. కష్టపడితే తప్ప సక్సెస్ సాధించలేరు.. కష్టపడకుండా వచ్చే సక్సెస్ ఎక్కువ కాలం నిలవదు.. రూపాయి రూపాయి కూడబెట్టి.. సక్సెస్ కోసం ఆరాటపడుతూ... దారిలో ఎన్నో ఆటుపోట్లు.. అవమానాలు దిగమింగుకొని అనుకున్న మార్గాన్ని చేరుకోవడానికి పడే కష్టం తప్పకుండా సక్సెస్ ను అందిస్తుంది అని నిరూపించారు కోటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరియు ఇండియా హెరాల్డ్ చైర్మన్ గుడివాడ తాలూకు రైతుబిడ్డ డా.సరిపల్లి కోటిరెడ్డి.. చదివింది కేవలం పదవ తరగతి మాత్రమే కానీ తన టాలెంట్ తో.. మైక్రోసాఫ్ట్ లో చీఫ్ యాప్ ఆర్కిటెక్ అయ్యి.. ఏదైనా సాధించాలంటే కృషి పట్టుదల ప్రధానం అని తెలియజేశారు.. ఇక ఈరోజు ఈయన పుట్టినరోజు ఈ సందర్భంగా మనం.. ఆయన సక్సెస్ స్టోరీ ని ఒకసారి గుర్తు చేసుకుందాం..


డా.సరిపల్లి కోటిరెడ్డి.. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి నేడు.. తన సంస్థ కార్యకలాపాలను 230 పైచిలుకు దేశాలలో విస్తరించి కొన్ని వేల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటూ.. నిరుద్యోగులకు తన సంస్థల ద్వారా ఉద్యోగం కల్పిస్తూ.. వారికంటూ ఒక హోదాని అందించి.. వారి గుండెల్లో దేవుడిగా కొలువయ్యారు. వేలకోట్లకు అధిపతి అయినా.. అణువంతైనా గర్వం లేకుండా ఉద్యోగులను కూడా కుటుంబ సభ్యులుగా చూసుకునే గొప్ప గుణం.. కృషి , పట్టుదలకు ఈయన నిలువెత్తు రూపం.. పదవ తరగతి పూర్తి చేసిన ఈయన   తొలుత 750 రూపాయలతో కెరియర్ మొదలుపెట్టి.. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించి ఏకంగా మైక్రోసాఫ్ట్ లోనే స్థానం సంపాదించింది.. నేడు మిలియన్ డాలర్లు అర్జిస్తున్నారు అంటే ఇక ఆయన ప్రతిభ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇక తన ప్రతిభతో విదేశాల్లో కూడా తన సంస్థలను స్థాపించి వైద్యం , మీడియా రంగాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఈయన ఒకప్పుడు దిగువ  తరగతి కుటుంబం నుంచి వచ్చి ఆ పరిస్థితులను అర్థం చేసుకొని ఇప్పుడు అలాంటి వారిని ఆదుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: