ప్రస్తుత కాలంలో పాన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం అయింది. ప్రతి ఒక్కరికి పాన్ కార్డు వినియోగం అనేది అనివార్యంగా మారింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ సంబంధిత పనుల కోసం ఖచ్చితంగా పాన్‌ కార్డ్‌ అనేది ఉండాల్సిందే. రూ. 50 వేలకు మించి లావాదేవీలని చేయాలన్నా, రుణం పొందాలన్నా ఖచ్చితంగా పాన్‌ కార్డ్‌ అనేది అనివార్యంగా మారింది.అయితే ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ పాన్‌ కార్డులో కొన్నిసార్లు మన పేరు తప్పుగా పడుతుంటుంది. ముఖ్యంగా చిన్న చిన్న స్పెలింగ్ మిస్టేక్స్‌ ఎక్కువగా ఉంటుంటాయి.అయితే వీటిని సరిచేసుకోవడానికి ఎక్కడికి వెళ్లాల్సిన పని ఉండదు. ఈజీగా ఇంట్లోనే కూర్చొని మీ పాన్‌ కార్డులో పేరు మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


అయితే ఇందుకోసం ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.ఆ తరువాత కరెక్షన్‌ అండ్‌ అప్లికేషన్‌ టైప్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ కేటగిరినీ సెలక్ట్‌ చేసకొని మొత్తం సమాచారాన్ని కూడా అందించాలి.ఇందులో భాగంగా మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇంకా పాన్‌ కార్డ్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి.ఇక ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన సబ్‌మిట్ బటన్‌పై నొక్కాలి. వెంటనే కేవైసీ కోసం ఫిజికల్‌ లేదా డిజిటల్‌ ని మీరు సెలక్ట్‌ చేసుకోవాలి. డిజిటల్ సెలక్ట్ చేసుకుంటే ఆధార్‌ ద్వారా ఈ-కేవైసీ ఈజీగా పూర్తి చేయొచ్చు.ఇక పాన్‌కార్డ్‌ ఈకేవైసీ కోసం ఆధార్ సెలక్ట్ చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్‌ను మీరు ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత మీరు వివరాలను మార్చిన పాన్‌ కార్డ్‌ను ఎలా పొందాలనుకుంటున్నారో ఒకసారి సెలక్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఆధార్ కార్డులోని చివరి నాలుగు నంబర్లను మీరు ఎంటర్‌ చేయాలి. ఆ తరువాత చివరిగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది.ఇక చెల్లింపు పూర్తయిన తర్వాత కంటిన్యూపై మీరు నొక్కాలి. ఆ వెంటనే ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేసి క్లిక్‌ చేస్తే ప్రాసెస్ ముగుస్తుంది. నెలరోజుల్లోనే మీ పాన్‌ కార్డ్‌ మీ అడ్రస్‌కు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: