నరేంద్ర మోదీ 2014లో మొదటిసారిగా భారతదేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన మహిళలను దృష్టిలో పెట్టుకొని చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. 2016లో ఉజ్వల స్కీం కింద ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభించారు. ఉజ్వల యోజన 2 అని దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే చిన్న గ్రామాలు సుదూర ప్రాంతాలకు కూడా గ్యాస్ కనెక్షన్లను అందించడం. ఈ పథకం కింద అర్హులైన వారికి ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తారు. అంతేకాకుండా ప్రతినెలా ప్రజలు సిలిండర్ కొనగలిగేలా సబ్సిడీ కూడా ఇస్తున్నారు. 

ఈ పథకం ద్వారా ఎంతో మంది మహిళలు కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ సిలిండర్ కి మారారు ఇంతకుముందు కట్టెల మీద వంట చేయలేక ఎంతో ఇబ్బంది పడినవారు మోదీ తెచ్చిన పథకం వల్ల పంటలు సులభంగా చేసుకోగలిగారు. వంట చేయడం సులభం చేయడం ద్వారా మహిళలకు చాలా మేలు చేశారు మోదీ.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) రెండవ దశ ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే 1 కోటి మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందారు. ఇప్పుడు, PMUY ఫేజ్ 2 కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన వ్యక్తులకు మరో అవకాశం అందుబాటులో ఉంది.

అర్హతలు 

మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మహిళా దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి. దరఖాస్తుదారు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గ్రామీణ దరఖాస్తుదారులకు వార్షిక ఆదాయం రూ.72,000 లోపు ఉండాలి. పట్టణ దరఖాస్తుదారులకు: వార్షిక ఆదాయం రూ.1 లక్ష లోపు ఉండాలి. దరఖాస్తుదారుని కుటుంబంలోని ఇతర సభ్యులు ఇప్పటికే ఈ పథకాన్ని పొంది ఉండకూడదు.

అవసరమైన పత్రాలు

 1. ఆధార్ కార్డు
 2. చిరునామా రుజువు
 3. రేషన్ కార్డు
 4. బ్యాంక్ పాస్ బుక్
 5. ఫోన్ నంబర్
 6. పాస్‌పోర్ట్ సైజు ఫోటో

* దరఖాస్తు ప్రక్రియ

 1. అధికారిక వెబ్‌సైట్‌ https://pmuy.gov.in విజిట్ చేయాలి. 

 2. హోమ్‌పేజీలో PMUY 2.0 కోసం "అప్లై" ఎంపికను ఎంచుకోండి. పథకం గురించిన మొత్తం సమాచారాన్ని సమీక్షించండి.

3. పేజీ దిగువన, "ఆన్‌లైన్ పోర్టల్" ఎంపికను ఎంచుకోండి. అందించిన జాబితా నుంచి గ్యాస్ కంపెనీని ఎంచుకోండి.

4. మీ ఫోన్ నంబర్, OTPని ఉపయోగించి లాగిన్ చేయాలి. కచ్చితమైన సమాచారంతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అన్ని వివరాలను వెరిఫై చేసి ప్రింటు సమర్పించిన తర్వాత దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి. మరిన్ని వివరాలు, అప్‌డేట్‌ల కోసం, అధికారిక PMUY వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: