అనంత్ అంబానీ అండ్ రాధిక మర్చంట్ పెళ్లి ఎంత అంగరంగ వైభోగంగా జరిగిందో మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం . కొన్ని వేల కోట్ల ఖర్చుతో వీరి వివాహం జరిగింది . కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాహ ఉత్సాహాలు ఇంకా పూర్తి కాలేదు ‌. త్వరలో లండన్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు అంబానీ ఫ్యామిలీ . అయితే పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు హాజరవ్వగా .. వారందరినీ చూసేందుకు కళ్ళు కూడా సరిపోలేదు .


ఇక శుభ్ అశీర్వాద్ వేడుక పూర్తి అయ్యాక అంబానీ ఫ్యామిలీ ఒక్కో సెలబ్రిటీకి పర్సనల్గా థాంక్స్ చెప్పేందుకు కొన్ని గంటల పాటు స్టేజ్ మీద నిల్చునే ఉండి ఫిదా చేశారు . మొత్తానికి వివాహం ఖర్చు దాదాపు 500 కోట్లు అయిందని అంచనా ఉండగా మరి కట్న కానుకలు ఏ విధంగా చదివించారనే ఆసక్తి నెలకొంది . ప్రజెంట్ దీనిపై ఫన్నీ మీన్స్ హల్చల్ చేస్తున్నాయి . దేశమే కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ ఆ పరిగణించబడుతున్న ఈ పెళ్లి ఖర్చు అంబానీ ఆస్తిలో కేవలం 0.5% మాత్రమే . కాగా ప్రేక్షకులు దీన్ని పూర్ మ్యారేజ్ గా పరిగణిస్తున్నారు .


అందుకే ఈ పేద పెళ్లికి తమ వంతుగా నాకు 349 చెల్లించుకుంటున్నామని అంటున్నారు . అంటే జియో మంత్లీ రీచార్జ్ అన్నమాట . ఇక ఈ పోస్టులపై స్పందిస్తున్న ప్రేక్షకులు.. తమ తరుపున ఇంత కట్నం అంటే తాము ఇంత చెల్లించామని నెల రీఛార్జ్ డబ్బుల గురించి చెబుతున్నారు . ఏదేమైనాప్పటికీ ఈ కన్వర్జేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . ఇక అలా జియో యూజర్స్ డబ్బులు పెట్టి అంబానీ తన కొడుకు మ్యారేజ్ చేశాడన్నమాట . ఇది చాలా పూర్ మ్యారేజ్ అనే చెప్పుకోవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి: