కొత్త కోడలు ముఖేష్ అంబాని ఇంట అడుగుపెట్టగానే ఆస్తి ఐశ్వర్యం పెరిగింది. అంబానీ కేవలం గత 10 రోజుల్లోనే ఏకంగా 25000 కోట్లు సంపాదించాడు. మన టాలీవుడ్ హీరోల ఆస్తులు అంతా కలిపిన కానీ ఇన్ని కోట్లు ఉండవు. అలా ఉంది ముఖేష్ అంబాని యాపారం.5000 కోట్లతో కొడుకు పెళ్లి చేశాడు ముఖేష్ అంబాని. అందరికి ఇది కళ్ళు చెదిరే పెద్ద అమౌంటే కావచ్చు. కానీ అంబానికి కాదు. అతనికి కేవలం ఇది అతని సంపాదనలో 0.5 శాతం. వాస్తవానికి అంబానీల పెళ్లిని కేవలం అనవసరమైన ఖర్చుగానే కాకుండా ఇది గొప్ప ఆదాయ మార్గమని నిరూపణ అయింది. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ల పెళ్లి రోజున రిలయన్స్ షేర్లు 1 శాతం పెరిగాయట. గత నెలలో ఈ షేర్లు మొత్తం 6.65 శాతం పెరిగాయి. గత ఆరు నెలల్లో అంబానీలు మొత్తం 14.90 శాతం రాబడిని సాధించారు. 12 జూలై 2024న రాధిక మర్చంట్‌తో తన కుమారుడు అనంత్ అంబానీ విలాసవంతమైన వివాహం జరిగిన తర్వాత ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీ నికర విలువ గణనీయంగా పెరిగింది. పెళ్లికి 5000 కోట్లు ఖర్చు చేసినా ముఖేష్ అంబానీ సంపద మాత్రం తగ్గలేదు. ఇది ఐదు రెట్లు పెరిగింది. పెళ్లి తర్వాత కేవలం 10 రోజుల్లోనే అంబానీ నికర ఆస్తుల విలువ ఏకంగా రూ.25,000 కోట్లు (సుమారు 3 బిలియన్ డాలర్లు) పెరిగింది.


బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జూలై 5న అంబానీ నికర ఆస్తుల విలువ మొత్తం 118 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. జూలై 12 నాటికి ఈ సంఖ్య ఏకంగా 121 బిలియన్ల డాలర్లకు పెరిగింది. అంటే 3బిలియన్ డాలర్లు అదనంగా పెరిగింది. ఈ అసాధారణ పెరుగుదల ప్రపంచ సంపద ర్యాంకింగ్స్‌లో ముఖేష్ అంబానీ స్థానాన్ని బాగా మెరుగుపరిచింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో 12వ స్థానం నుండి 11వ స్థానానికి ఇప్పుడు ముఖేష్ అంబానీ చేరుకున్నారు. కానీ అతడు ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్నాడు.అంబానీ నికర ఆదాయ విలువ పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పటిష్ట పనితీరే కారణమని చెప్పవచ్చు. పెళ్లి రోజున తన రిలయన్స్ షేర్లు 1 శాతం పెరగగా... గత నెలలో షేర్లు ఏకంగా 6.65 శాతం పెరిగాయి. గత ఆరు నెలల్లో వారు మొత్తం 14.90 శాతం రాబడిని అందించారు. అయితే పెళ్లి తర్వాత మంగళవారం నాడు మాత్రం షేర్లు 1.11 శాతం స్వల్పంగా క్షీణించి రూ.3,159 వద్ద ట్రేడవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: