ఆన్లైన్ దొంగలు అనగా.. సైబర్ నేరగాళ్లు గురించి కూడా మనకి తెలుసు. నిత్యం ప్రపంచం నలుమూలల లక్షల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఈ కేటుగాళ్లు ఆన్లైన్ వేదికగా సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. అందుకే సైబర్ సెక్యూరిటీ వారు కొన్ని సూచనలు చేస్తూ తాజాగా ఓ నివేదిక వెల్లడించారు. అందులో ఎవరన్నా అపరిచిత వ్యక్తులు ఏదైనా మెసేజ్లు మీకు పంపించినట్లయితే వాటిని దయచేసి ఓపెన్ చేయకండి అంటూ సూచనలు చేస్తున్నారు.
నకిలీ వెబ్సైట్లు గురించి మీరు అందరూ వినే ఉంటారు. ఆల్రెడీ ఉన్న అధికారిక వెబ్ సైట్లకు వీరు నకిలీవి సృష్టిస్తూ వినియోగదారులను మధ్య పెట్టె ప్రయత్నం చేస్తారు. ఆయా వెబ్సైట్లో విషయంలో జర జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారులు కోరుతున్నారు. తాజాగా ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ వెబ్సైట్లకు సంబంధించి అనేక రకాల ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఊరిస్తూ.. మెసేజ్లు పంపిస్తున్నారని వెల్లడయింది. కాబట్టి ఏదైనా నకిలీ వెబ్సైట్ నుండి మీకు మెసేజెస్ వచ్చినట్లయితే, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సైబర్ బ్యూరో చెప్పుకొచ్చింది.