అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్ వచ్చేసింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్ తేదీలను ప్రకటించింది. ఆగస్టు 6వ తేది నుంచి 15వ తేది వరకూ ఈ సేల్ సాగనుంది. ఈ సేల్‌లో భాగంగా తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లభించనున్నాయి. భారీ డిస్కౌంట్లు ఉండటంతో ఈ సేల్ కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సేల్‌లో భాగంగా 50 నుంచి 80 శాతం వరకూ ఫ్యాషన్ ఉత్పత్తులు లభించనున్నాయి. టీవీలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం డిస్కౌంట్స్ పొందే అవకాశం ఉంది. అలాగే స్మార్ట్ గాడ్జెట్లపై 50 నుంచి 80 శాతం వరకూ డిస్కౌంట్ ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్‌లో భాగంగా ఐఫోన్ ధరలు కూాడా భారీగానే తగ్గాయి. అందులో కూడా ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్ ఫోన్ ధర రూ.79,600 ఉండగా డిస్కౌంట్‌లో రూ.54,999కి లభించనుంది. 6.7 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేతో ఈ ఫోన్ లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ 12MP+12MP కెమెరాలతో సహా 12MP సెల్ఫీ కెమెరాతో రానుంది. అలాగే గూగుల్ పిక్సెల్ 7 కూడా రూ.30,999లకే లభించనుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ రూ. 38,999లకు, మోటో ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ రూ.21,999లకు, పోకో ఎఫ్6 రూ.25,999లకు అందుబాటులో ఉండనున్నాయి.

ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం వరకూ డిస్కౌంట్ కూడా లభించనుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంకు ఆఫ్ బరోడా కార్డ్, ఎస్ బ్యాంక్‌లపై కూడా 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ పొందొచ్చు. అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు అయితే సూపర్ కాయిన్స్ కూడా వినియోగించుకోవ0చ్చు. ఈ సేల్ గురించి మరిన్ని వివరాలను https://www.flipkart.com/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: