ఆ స్మార్ట్‌ఫోన్‌ను చెత్త బుట్టలో సీక్రెట్ గా ప్లేస్ చేశారు, ఆ డస్ట్ బిన్ కు ఒక రంధ్రం చేసి ఆ రంధ్రం ద్వారా కెమెరాతో మహిళలను రికార్డు చేసేలాగా ఫోన్ ఉంచారు. అంటే, ఆ రంధ్రం ద్వారా ఫోన్‌లోని కెమెరా బయటి వైపు విజువల్స్ రికార్డ్ చేస్తుంది. ఫోన్ సౌండ్స్ ఎవరికీ వినిపించకుండా చేయడానికి ‘ఎయిర్‌ప్లేన్ మోడ్’ సెట్టింగ్‌లో పెట్టారు. ఆ చెత్త బుట్టకు ఉన్న చిన్న రంధ్రం ఆ మహిళ చూడటం, అప్పుడు కెమెరా లెన్స్ కనపడటం జరిగింది. మహిళ ఆ ఫోన్‌ను కనుగొనే సమయానికి, అది రెండు గంటలపాటు వీడియో రికార్డ్ చేసిందని వార్తలు చెబుతున్నాయి.
ఆ త్రీ వేవ్ కాఫీ షాప్ యజమానుల ప్రకారం, ఆ స్మార్ట్‌ఫోన్ ఆ షాప్‌లోనే పనిచేసే ఒక ఉద్యోగిది. పేరు మనోజ్. వయసు 23 ఏళ్లు. ఆ ఉద్యోగిని వెంటనే పని నుంచి తొలగించారు, ఈ నేరానికి పాల్పడినందుకు గానూ అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు.
"ఈ సంఘటన నన్ను చాలా భయపెట్టింది. ఇకపై ఏ బాత్రూమ్‌లోకి వెళ్ళినా జాగ్రత్తగా ఉంటాను. అది ఎంత పేరున్న హోటల్ అయినా సరే. మీరందరూ కూడా అలాగే చేయాలని నేను కోరుతున్నాను. ఇది చాలా దుర్మార్గం" అని ఆ మహిళ బెంగళూరులోని ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ అయిన "gangsofcinepur" లో పోస్ట్ చేసింది. చాలామంది మహిళలు బయట వాష్‌రూమ్స్ వాడకపోవడమే మంచిదేమో అని కామెంట్లు చేస్తున్నారు.