అయితే నేటి డిజిటల్ యుగంలో ప్రతి ప్రయాణికుడు టికెట్లు కొనుగోలు కోసం డిజిటల్ విధానంలోనే చెల్లింపు చేసుకునే వెసులుబాటు మన భారతీయ రైల్వే వ్యవస్థ కల్పిస్తోందని సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైల్వే వారు ప్రయాణికులకు తాజాగా ఒక శుభవార్తను అందించారు. విషయం ఏమిటంటే... రైల్వే స్టేషన్ కి వెళ్ళేటప్పుడు ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిలబడకుండా తేలికగా టికెట్స్ డిజిటల్ రూపంలో కొనుగోలు చేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రయాణికులు డిజిటల్ చెల్లింపులు చేయవచ్చును. ఈ విధానాన్ని మొదటగా పశ్చిమ రైల్వే జోన్.. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్, భావ్‌నగర్ డివిజన్‌లలోని అన్ని స్టేషన్లలో QR కోడ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇక త్వరలో ఈ విధానం దేశంలోనే అన్ని జోన్స్ లోకి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సంబంధిత రైల్వే డివిజన్ మేనేజర్ అశ్విని కుమార్, రమేష్ కుమార్ తెలియజేశారు. ఇప్పటికే పలు రైల్వే డివిజన్లో ప్రయాణికులు డిజిటల్ చెల్లింపులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా చోట్ల మొబైల్ యాప్, ఏటీవిఎం, పిఓఎస్, యూపీఐ పలు విధానాలు ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుంది. అయితే ఈ విధానాన్ని ఇంకా విస్తరించాలనే ధ్యేయంతో ఇండియన్ రైల్వే వ్యవస్థ తాజా ప్రకటన చేసింది.