యాపిల్ వాచ్ SE
ఇది యాపిల్ బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లలో ఒకటి. ఆల్వేస్ ఆన్ రెటినా డిస్‌ప్లేతో 40mm డిస్‌ప్లేతో వస్తుంది కాబట్టి విజువల్స్‌ను స్పష్టంగా రీడ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో వర్కౌట్ ట్రాకింగ్, క్యాలరీ మానిటరింగ్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఉన్నాయి. ఇది OS ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 32 GB మెమరీని కలిగి ఉంటుంది. దీనిని వైఫై, బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు. ఈ వాచ్ ప్రైస్ రూ.27,499.
ఫాసిల్ జెన్ 6
ఈ స్మార్ట్‌వాచ్ iOS, ఆండ్రాయిడ్ డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 24 గంటల వరకు బ్యాకప్ అందిస్తుంది. ఇందులో హార్ట్ రేట్ ట్రాకింగ్, GPS ట్రాకింగ్, వివిధ వ్యాయామాలకు మద్దతు ఉంటుంది. ఈ గడియారం స్మార్ట్ నోటిఫికేషన్లు, మ్యూజిక్ కంట్రోల్, గూగుల్ పే ద్వారా చెల్లింపులను కూడా అందిస్తుంది. ఇది వేర్ ఓఎస్ బై గూగుల్‌తో రన్ అవుతుంది. 32 GB మెమరీని కలిగి ఉంది. ఈ ఫాసిల్ స్మార్ట్‌వాచ్ ధర రూ.11,998.
అమెజ్‌ఫిట్ యాక్టివ్ 42mm స్మార్ట్ వాచ్:
ఈ వాచ్ స్క్రీన్ చాలా పెద్దది. దీన్ని చూసినప్పుడు, ఒక చిన్న ఫోన్ స్క్రీన్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ వాచ్ మీ ఆరోగ్యం ఎలా ఉంది, హృదయ స్పందన, రక్తంలో ఆక్సిజన్ ఎంత ఉంది, రక్తపోటు ఎంత ఉంది వంటి వివరాలన్నీ చెప్తుంది. మీరు ఎంత వ్యాయామం చేస్తున్నారో కూడా ఈ వాచ్ రికార్డు చేస్తుంది. ఈ వాచ్ ఒకసారి చార్జ్ చేస్తే, దాదాపు రెండు వారాల పాటు పని చేస్తుంది. ఈ వాచ్ ధర రూ.9,999.
శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 4
ఈ వాచ్ కూడా ఆరోగ్యం గురించి చాలా విషయాలు చెప్తుంది. అమెజ్‌ఫిట్ వాచ్ లాగే, ఇది కూడా హృదయ స్పందన, రక్తపోటు లాంటివి కొలుస్తుంది. అంతేకాకుండా, ఇది మరో కొన్ని హెల్త్ టెస్ట్స్ కూడా చేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే, దాదాపు రెండు రోజులు పని చేస్తుంది. ఈ వాచ్ ధర రూ.10,499
ఫిట్‌బిట్ వర్సా 4 ఫిట్‌నెస్ వాచ్
ఒక స్మార్ట్ వాచ్ స్క్రీన్ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఇందులో GPS ఉంది మీ హృదయం ఎంత వేగంగా కొడుతుందో ఈ వాచ్ చూపిస్తుంది. ఎంత సేపు నిద్రపోతున్నారు, ఎంత ఒత్తిడిలో ఉన్నారు అన్నది ఈ వాచ్ చెప్తుంది. వాచ్ వ్యాయామం చేయడానికి కొన్ని ట్రిక్స్ చెప్తుంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి శ్వాస ఎలా తీసుకోవాలో ఈ వాచ్ నేర్పిస్తుంది. దీని ధర రూ.16,999.