బ్రిటిల్ బోన్ డిసీజ్ అనే పిలిచే ఆస్టియో జెనెసెస్ ఇంపెర్పెక్టా వల్ల విజయదీపిక కాస్త ఇబ్బంది పడింది. తన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ టేబుల్ టెన్నిస్‌లో మెరిసింది. ఆస్టియోజెనిసిస్ ఇంపెర్‌ఫెక్టా అనే జన్యుపరమైన వ్యాధి పోరాడుతూనే తన క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎన్నో ఇబ్బందులు భరించి 14 ఏళ్ల వయసులో తల్లి ప్రోత్సాహంతో క్రీడల్లో ముందుకు సాగింది. తల్లి అరుణ ప్రత్యేక శిక్షణలో ఆరితేరింది. దీంతో 14 ఏళ్ల వయస్సులో జాతీయ స్థాయి పతకాలను సాధించింది.
ఫిబ్రవరి 2024లో ఇండోర్‌లో జరిగిన జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో విజయ దీపిక రెండు రజత పతకాలు, ఒక కాంస్య పతకాన్ని గెలిచి చరిత్ర సృష్టించింది. పారా టేబుల్ టెన్నిస్‌లో ఆమె కొత్త చరిత్రను రాసింది. కదల్లేని స్థితిలో ఉన్నా తల్లి ప్రోత్సాహంతో విజయాలను సాధిస్తూ విజయ దీపిక ముందుకు సాగుతోంది. ఆమె ఎముకలు పలుచని స్థితిలో ఉన్నప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా విజయదీపిక పారా స్పోర్ట్స్ లో దూసుకుపోతోంది. ప్రభుత్వం, క్రీడాసంస్థలు, స్పాన్సర్లు ముందుకొస్తే తాను మరిన్ని విజయాలు సాధిస్తానని విజయదీపిక ధీమా వ్యక్తం చేస్తోంది.