కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 18వ తేదీన 65 పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చాలా మంది ఆమె సాధించిన విజయాలు ఆస్తుల గురించి అడగడం స్టార్ట్ చేశారు. పబ్లిక్ గా అవైలబుల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమెకు బాగానే ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటున్న ఆమె దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నట్లు సమాచారం. రాజ్యసభకు నామినేషన్ వేసే సమయంలో ఆమె అఫిడవిట్‌లో ఆస్తి వివరాలు వెల్లడించారు. వాటితో పాటు ఇంటర్నెట్ లో అవైలబుల్‌లో ఉన్న సమాచారం ప్రకారం ఆమె నెట్ వర్త్ ఎంతో తెలుసుకుందాము.

ఖాతాలో ఎంత డబ్బు ఉంది?

అఫిడవిట్ ప్రకారం, 2022లో నిర్మలా సీతారామన్ మొత్తం ఆస్తులు విలువ రూ.2.53 కోట్లు. ఇందులో రూ.1.87 కోట్లు స్థిరాస్తులు కాగా రూ.65.55 లక్షలు చరాస్తులు. ఆమె రూ.26.91 లక్షల లోన్ కూడా తీసుకున్నారు. ఆమె వద్ద ఓ బజాజ్ చేతక్ స్కూటర్ ఉండగా దీని వాల్యూ రూ.28,200 ఉంటుందని సమాచారం. నిర్మలమ్మ బ్యాంక్ అకౌంట్‌లో కేవలం   రూ.7,350 క్యాష్ మాత్రమే ఉందట. పీపీఎఫ్ అకౌంట్‌లో రూ.1,59,763, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.5,80,424 ఆమె ఇన్వెస్ట్ చేశారు. సీతారామన్‌కు హైదరాబాద్‌లో రూ.1,70,51,400 విలువైన రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉంది. కుంటలూరులో రూ.17,08,800 విలువైన ఓ వ్యవసాయేతర భూమి కూడా ఆమె పేరిటే ఉంది. రూ.21 లక్షల వ్యాలీబుల్ గోల్డ్ కూడా ఉన్నట్లు ఆమె అఫిడవిట్‌లో తెలిపారు.

 19 ఏళ్ల హోమ్ లోన్, వన్ ఇయర్ ఓవర్‌డ్రాఫ్ట్, 10 ఏళ్ల తనఖా రుణం కూడా తనకు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. రూ. 5,44,822 హోమ్ లోన్ చెల్లించాల్సి ఉందని కూడా తెలిపారు. ఓవర్‌డ్రాఫ్ట్ లోన్ రూ. 2,53,055, కాగా తనఖా లోన్ రూ.18,93,989గా ఉంది. అయితే ఈమెకు ఒక కారు కూడా లేదని చెప్పడం విశేషం. రూ.3.98 లక్షల విలువైన సిల్వర్ ఐటమ్స్ మాత్రం ఆమె దగ్గర ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా ఆమె మంత్లీ సుమారు రూ.4,00,000 పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: