ఇండియాలో ఎంతోమంది సంపన్నులు ఉన్నారు. వీరందరిలో అపర కుబేరుడు ఎవరు అంటే ముందుగా అటు ముఖేష్ అంబానీ పేరు గుర్తుకు వస్తూ ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ముఖేష్ అంబానీ సంపాదన విషయంలో అందరిని వెనక్కినట్టే టాప్లో కొనసాగుతూ ఉంటారు. అందుకే ఆయనని అపర కుబేరుడు అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచం లో ఉన్న సంపన్నుల జాబితాలో కూడా ఎప్పుడు ముఖేష్ అంబానీ టాప్ టెన్ లో కొనసాగుతూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇలా పురుషుల్లో ముఖేష్ అంబానీ సంబంధాల జాబితాలో టాప్ లో ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ మహిళల్లో ఇండియాలోనే అత్యంత సంపన్న మహిళ ఎవరు అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. బహుశా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో కూడా పెద్దగా వెతికి ఉండకపోవచ్చు. అయితే ఇండియాలోనే అత్యంత ఎక్కువ సంపద కలిగిన మహిళ ఎవరు అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్లో తెగ వెతికేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇలా ఇండియాలోనే అత్యంత సంపన్న మహిళ ఎవరో కాదు రాధా వెంబు. ఈమె 'జోహో' కో ఫౌండర్. ఈమె నికర ఆస్తి విలువ 47 వేల ఐదు వందల కోట్ల రూపాయలు.  ఈ క్రమంలోనే ఈమె తన సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. జోహో కార్ప్ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్, టెక్, ఇంటర్నెట్ వెబ్ సంబంధిత సాధనాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. రాధా వెంబు ఐఐటి మద్రాస్ లో చదివారు. తన సోదరుడితో కలిసి జోహో అనే కంపెనీని స్థాపించారు. ఇందులో ఆమెకు 50% వాటా ఉంది. జోహో తో పాటు జానకి హైటెక్ ఆగ్రో లిమిటెడ్, హైలాండ్ వాలీ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలకు కూడా ఈమె డైరెక్టర్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: