ప్రపంచంలోనే భారతీయ రైల్వేకి ఓ ప్రముఖ స్థానం ఉందని చెప్పవచ్చు. లక్షల మంది ఉద్యోగులు రేయింబవల్లు కష్టపడుతూ ప్రతిరోజు లక్షలమంది ప్రజలను సురక్షితంగా వారి గమ్య స్థానాలను చేర్చేందుకు ఎంతగానో కష్టపడుతోంది. ఇకపోతే రోజు రోజుకి భారతీయ రైల్వే పురోగతి చెందుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇందులో భాగంగానే గత కొద్దికాలం నుండి దేశవ్యాప్తంగా అనేక వందే భారత్ రైల్లను ప్రవేశపెట్టింది భారతీయ రైల్వే. ప్రపంచ స్థాయిని ప్రతిబింబించేలా అనేక ఫీచర్లను ఈ కొత్త రైళ్లలో అందించింది భారతీయ రైల్వే. తాజాగా కూడా నరేంద్ర మోడీ ఈ వందే భారత్ రైళ్లను మూడు రూట్లలో కొత్తగా ప్రవేశపెట్టారు.

 మరోవైపు వందే భారత్ స్లీపర్ రైల్లు కూడా ప్రారంభానికి సిద్ధమైపోతున్నాయి. ప్రపంచ స్థాయి ఫీచర్లను ఈ కొత్త రైళ్లలో తీసుకురాబోతోంది భారతీయ రైల్వే. ఇందుకు సంబంధించి తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం నాడు బెంగళూరులోని బిఈఎంఎల్ లో కొత్తగా తయారవుతున్న వందే భారత్ స్లీపర్ కోచ్ లని ఆయన పరిశీలించారు. ఈ విషయం సంబంధించి రాబోయే మూడు నెలల్లో ఈ వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ అనే నాలుగు కాన్ఫిరిగేషన్లో త్వరలో దేశం పొడువున మెరుగైన రైలు సేవలను అందిస్తామని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రజల నుంచి వారు తీసుకున్న ఫీడ్బ్యాక్ ద్వారా వందే భారత్ ప్రతి వర్షిని మెరుగుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇకపోతే ఈ రైళ్ల ఫీచర్ల విషయానికి వస్తే..


వందేమాత స్లీపర్ రైళ్లు స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణాన్ని కలిగి ఉన్నట్లు.. అలాగే ప్రయాణికుల భద్రత మెరుగుపరచడానికి అనేక ఫీచర్లను జోడించినట్లు సమాచారం. ఇందులోనే భాగంగా క్రాష్ బఫర్లు, క్లపర్ లాంటి ఆధునిక క్రాష్ ఎలిమెంట్లను ఇందులో అమర్చబడ్డాయి. పొరపాటున ఏదైనా అగ్నిప్రమాదంలో సంభవించిన సమయంలో కూడా రైలు అగ్నిప్రమాదం తట్టుకునే విధంగా దానిని రూపొందించినట్లు తెలియజేస్తోంది. ఇకపోతే వందేమాత స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్ లు ఉండగా.. ఇందులో 11 ఏసీ 3 టైర్ కోచ్ లలో 611 బెర్తులు, అలాగే నాలుగు టైర్ 2 ఏసి లో 188 బెర్తులు, అలాగే టైర్ వన్ ఏసీలో 24 బెర్తులు ఉండబోతున్నాయి.


ఇందుకు సంబంధించి స్లీపర్ కోచ్ లు మరింతగా అప్గ్రేడ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రైలును గంటకు సుమారుగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసేలా అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ఈ రైలులో USB ఛార్జింగ్ సదుపాయంతో కూడిన ఇంటిగ్రేడ్ రీడింగ్ లైట్, పబ్లిక్ అనౌన్స్మెంట్ అలాగే విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇంకా ఇన్సైడ్ డిస్ప్లే ప్యానెల్ అలాగే అనేక సెక్యూరిటీ కెమెరాలు, బ్యాడ్యులర్ బ్యాటరీలు అనేకమైన ప్రత్యేక ఫీచర్లను ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా అందించబోతున్నారు. అంతేకాకుండా ఈ రైలులో వికలాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక ఈ రైలులో ఫస్ట్ ఏసీలో హాట్ షవర్స్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని ఆటోమేటిక్ ఎక్స్టీరియర్ డోర్స్, అలాగే సెన్సార్ ఆధారంగా పనిచేసే ఇంటర్ కమ్యూనికేషన్ డోర్స్ రిమోట్ తో పనిచేసే ఫైర్ బారినర్ డోర్లు ఇంకా అత్యధిక నవీకరణ చెందిన డిజైన్లతో రూపొందించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: