ప్రపంచవ్యాప్తంగా భారతీయ మధ్యనికి మద్యానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ డిమాండ్ కోసం అంతర్జాతీయ మార్కెట్లో ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ ని కూడా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. అయితే రాబోయే కొన్ని రోజులలో తమ ఎగుమతులను ఒక మిలియన్ అమెరికాల డాలర్లకు  (సుమారు రూ. 8,000 కోట్లు)  పెంచాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) ప్రకారం ఆల్కహాలిక్ డ్రింక్స్ ఎగుమతి విషయంలో భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే 40వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. అలాగే  మేక్ ఇన్ ఇండియా కింద ప్రధాన విదేశీ మార్కెట్లకు భారతీయ మద్యం  ఎగుమతులను పెంచడమే లక్ష్మన్నట్లు ప్రభుత్వం తెలియచేసింది. 

2023-24 సంవత్సరంలో దేశంలో మద్యపానాల ఎగుమతి దాదాపు పైగా జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా యుఎఇ, సింగపూర్, నెదర్లాండ్స్, టాంజానియా, అంగోలా, కెన్యా, రువాండా  దేశాలకు గరిష్ట ఎగుమతులు జరిగినట్లు నివేదిక తెలుపుతుంది. అలాగే (యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్) గోదావన్‌ను  కూడా యూకే లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.. వాస్తవానికి ఇది రాజస్థాన్లో తయారుచేసే సింగిల్ మాల్ట్ విస్కీ..

ఈ క్రమంలో  బ్రూవర్స్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి మాట్లాడుతూ.. ఈ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, అధిక నాణ్యత గల విస్కీ ఉత్పత్తిదారులను భారతదేశ ఖ్యాతిని పెంపొందించడంలో సింగిల్-మాల్ట్ విస్కీ  ముఖ్య పాత్ర పోషిస్తుందని  అలాగే రుచికరమైన డ్రింక్స్ కోసం డిమాండ్ బాగా ఉందని ఆయన తెలియజేశారు. అలాగే ఆఫ్రికా ,అమెరికా ,యూరప్ దేశాలకు ఎగుమతులు అపరిమితంగా అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు .. అలాగే రాష్ట్ర ఎక్సైజ్ పాలసీలలో ఎగుమతి ప్రోత్సాహాన్ని చేర్చాలని రాష్ట్రాలను కోరాలని ఆయన ప్రభుత్వాని కోరడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పానీయాలకు బాగా ఆకర్షితులు అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: