కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టూ వీలర్స్ కొనుగోలు చేయబోయే వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన బైక్‌లు, స్కూటర్లు తయారు చేసే కంపెనీలన్నీ హెల్మెట్‌లు తప్పనిసరిగా అందించాలని చెప్పారు. దేశంలో ప్రతి సంవత్సం రోడ్డు ప్రమాదాలలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ఎక్కువ మంది హెల్మెట్ ధరించకపోవడమే కారణం. అందుకే, ద్విచక్రాల వాహనాలు కొనుగోలు చేసే వారికి హెల్మెట్‌లు డిస్కౌంట్ ప్రైస్ ధర లేదా సరైన ధరకు అందించాలని మంత్రి సూచించారు.

అంటే బండి కొనుగోలు చేసేటప్పుడే హెల్మెట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. బయటికి వెళ్లి హెల్మెట్ కోసం బేరాలు ఆడాల్సిన అవసరం లేదు. బండితో పాటే అది వస్తుంది కాబట్టి దాన్ని ధరించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీనివల్ల ప్రాణాలు పోయే అవకాశం తగ్గుతుంది. ఇది ద్విచక్ర వాహనదారులకు చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు.

రోడ్డు రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ.. " వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లకు హెల్మెట్‌లపై రాయితీలు కల్పించాలని ద్విచక్ర వాహన కంపెనీలను కోరాను. హెల్మెట్ ధరించమని ప్రజలను ప్రోత్సహించడం ద్వారా ఇది ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది." అని అన్నారు. భద్రత కోసం పాఠశాల బస్సులకు సరైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కూడా ఉందని నితిన్ గడ్కరి చెప్పారు.

మంత్రి గడ్కరీ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి ప్రభుత్వం జరిమానాలను పెంచింది, అయితే ఈ నిబంధనలను అమలు చేయడం పెద్ద సవాలు అని అన్నారు. భారతదేశంలోని ప్రతి ఏరియాలో డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల వల్ల భారతదేశంలో 43% మంది అనుకోకుండా మరణిస్తున్నారు. ఈ ప్రమాదాల్లో చాలా వరకు అతివేగం కారణంగానే జరుగుతున్నాయి. గడ్కరీ లక్ష్యం ఏంటంటే సురక్షితమైన డ్రైవింగ్ నైపుణ్యాలను నేర్పడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం,  ట్రాఫిక్ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడం.

మరింత సమాచారం తెలుసుకోండి: