బహుశా ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన కార్లలో రోల్స్ రాయిస్ బ్రాండు పేరు ప్రధమంగా వినబడుతూ ఉంటుంది. కంపెనీ వాహనాల శ్రేణిలో ఫాంటమ్, 2003లో మొదటిసారిగా అందించిన నాలుగు-డోర్ల సెలూన్తో పాటు దాని పొడిగించిన వీల్బేస్ రెండు-డోర్ల కూపే మరియు కన్వర్టిబుల్ వేరియంట్లు ఇపుడు విరివిగా అమ్ముడు పోతున్నాయి. ఈ లిస్టులో చిన్న ఘోస్ట్ నాలుగు-డోర్ల సెలూన్; వ్రైత్ రెండు-డోర్ల కూపే; డాన్ కన్వర్టిబుల్; కుల్లినాన్ SUV, మరియు 2023 స్పెక్టర్, మొదటి ఆల్-ఎలక్ట్రిక్ రోల్స్-R మొదలైనవి ఉన్నాయి.
ఇక రోల్స్ రాయిస్ కారు కలినన్ చౌకైన మోడల్ ధరే దాదాపుగా రూ. 6.95 కోట్ల నుండి ప్రారంభమవుతుంది అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు. అయితే అత్యంత ఖరీదైన మోడల్ ఫాంటమ్ ధర మాత్రం రూ. 9.50 కోట్ల నుండి ప్రారంభమవుతుంది. కాగా రోల్స్ రాయిస్ ఇండియాలో 3 కార్ మోడళ్లను అందిస్తుంది. ఇందులో ఎస్‍యూవీ'లు కేటగిరీలో 1 కారు, సెడాన్స్ కేటగిరీలో 1 కారు, కూపే కేటగిరీలో 1 కారు ఉన్నాయి.
ఇండియాలో (నవంబర్ 2024) రోల్స్ రాయిస్ కార్లు ధరల లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే... రోల్స్ రాయిస్ ఫాంటమ్ ధర Rs. 9.50 కోట్లు, రోల్స్ రాయిస్ స్పెక్టర్ ధర Rs. 7.50 కోట్లు కాగా రోల్స్ రాయిస్ కలినన్ ధర Rs. 6.95 కోట్లుగా ఉంది. ఇక ఔత్సాహికులైన వారి వీటిని EMI రూపంలో కూడా సొంతం చేసుకోవచ్చు. అది బ్రాండును బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు రోల్స్ రాయిస్ స్పెక్టర్ కావాలనుకునేవారు ముందే డౌన్ పేమెంట్ కింద ₹13,42,245 చెల్లించవలసి ఉంటుంది. 1,55,93,950 వడ్డీతో కలిపి మొత్తం లోన్ ధర 8,05,34,700 గా ఉంది. ఇక రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎక్స్-షోరూమ్ ధర అయితే 75,000,140గా ఉంది. ఇక ఆర్టీఓ 2,919,471, ఇన్సూరెన్స్ 50,140 అనేవి తప్పనిసరి.