దేశీయ టెలికాం దిగ్గజాలైన జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ ఐడియా భవిష్యత్తులో రీఛార్జ్ ప్లాన్ల ధరలు విపరీతంగా పెంచేస్తామని నేరుగానే చెప్పేస్తున్నాయి ఇప్పటిదాకా నష్టాలు అనే ఉన్నామని అందుకే ప్లాన్ల ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ టెలికాం సంస్థ bsnl చీపెస్ట్ ప్లాన్స్ లాంచ్ చేస్తూ ప్రజలను భారీ ఎత్తున ఆకట్టుకుంటుంది. ఈ సంస్థలో గత రెండు నెలల్లో కొత్తగా 65 లక్షల కస్టమర్లు చేరారు, అయితే జియో, ఎయిర్‌టెల్ మాత్రం లక్షల్లో వినియోగదారులను కోల్పోయాయి. ఉన్న కస్టమర్లను నిలుపుకోవడానికి అలాగే కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి bsnl ఒక సరికొత్త ప్లాన్ వేసింది. అది సమీప భవిష్యత్తులో టారిఫ్‌లను పెంచబోమని ప్రకటించింది. అంతే ఇంకేముంది ప్రజలు పోలోమని పోర్ట్ పెట్టుకుని బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు అయిపోతున్నారు.

ఫోన్ బిల్లులను తగ్గించుకోవడానికి, అలాగే అంత తక్కువ ధరలకే డేటా పొందడానికి ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారు. అదే బీఎస్ఎన్ఎల్ కి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది అయితే బీఎస్ఎన్ఎల్ సర్వీస్ క్వాలిటీ అంత బాగుండదని కొందరు పేర్కొంటున్నారు. లంగా ధరలు చీప్ అనే విషయం వాస్తవమే కానీ సర్వీస్ బాగో లేకపోవడం వల్ల దానిలో చేరిన ప్రయోజనాలు ఉండడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో ఈ సంస్థ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఏం బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుందో ఆ బెనిఫిట్స్ ను కరెక్ట్ గా కస్టమర్లందరికీ అందజేస్తే అప్పుడు వారికి ఏమైనా ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ సేవలను కాస్త మెరుగుపరిచారు ఇంకొంత మెరుగుపరిస్తే ఈ సంస్థకు ఇండియాలో పోటీ ఉండదని చెప్పుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను కూడా ఇటీవలే లాంచ్ చేసింది. ఇక త్వరలో ఎలాన్ మస్క్ శాటిలైట్స్ ద్వారా ఇండియాకి ఇంటర్నెట్ అందిస్తానని చెబుతున్నారు. ఇలా అన్నీ కోణాల నుంచి ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ కంపెనీలకు పోటీ ఎదురవుతోంది ఈ పోటీలో అవి సర్వైవ్ అవుతాయా లేదా అనేది ఆసక్తికర అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: