చెక్కు ద్వారా బ్యాంకు నుంచి డబ్బు తీసేటప్పుడు, మనం రాసిన అమౌంటు తర్వాత ‘ఓన్లీ’ అనే పదం కూడా రాస్తాము. ఇది కేవలం ఒక అలవాటు కాదు, చెక్కును మోసాల నుంచి రక్షించడానికి చాలా ముఖ్యమైన జాగ్రత్త. చెక్కును నింపేటప్పుడు, మనం డబ్బు మొత్తాన్ని అంకెలలోనూ, పదాలలోనూ రాయాలి. ఉదాహారణకు, మనం రూ. 5,00,000/- తీసుకోవాలనుకుంటే, అంకెలలో 5,00,000/- అని రాసి, పదాలలో “ ఫైవ్ లాక్ రుపీస్ ఓన్లీ” అని రాయాలి. ఇలా ‘ఓన్లీ’ అని రాసిన తర్వాత, ఎవరూ మనం రాసిన మొత్తంలో అదనపు అంకెలు లేదా పదాలు చేర్చి, మనం తీసుకునే డబ్బు మొత్తాన్ని పెంచలేరు.
మనం చెక్కులో “ఐదు లక్షల రూపాయలు” అని మాత్రమే రాస్తే, మోసగాళ్ళు దాని తర్వాత “పదివేలు” లేదా “పాతిక వేలు” అని జోడించి, మనకు తెలియకుండా ఎక్కువ డబ్బు తీసుకోవచ్చు. కానీ, “ఐదు లక్షల రూపాయలు మాత్రమే” అని రాస్తే, మనం తీసుకోవాలనుకున్న మొత్తం అదే అని స్పష్టంగా తెలుస్తుంది. ఎవరూ దానిలో మార్పులు చేయలేరు.
బ్యాంకులు చెక్కుల భద్రతను చాలా తీవ్రంగా పరిగణిస్తాయి. మనీ అమౌంట్, తేదీ లేదా సంతకం రాసేటప్పుడు చిన్న తప్పు చేసినా, చెక్కు తిరస్కరించబడవచ్చు. అందుకే, అన్ని విషయాలను స్పష్టంగా రాసి, రెండుసార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అమౌంట్ ను పదాలలో రాసి, “ఓన్లీ” అని జోడించడం వల్ల, బ్యాంకు మనం తీసుకోవాలనుకున్న కచ్చితమైన మొత్తాన్ని ధృవీకరించడానికి సహాయపడుతుంది.
చెక్కుపై ‘ఓన్లీ’ అనే పదాన్ని రాసే చిన్న అలవాటు, చెక్కు మోసాలను నిరోధించడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇది ఒక అదనపు భద్రతా కవచం లాంటిది. మనం రాసిన మొత్తాన్ని ఎవరూ మార్చలేరు. అందుకే, చెక్కులు రాసేటప్పుడు ఎల్లప్పుడూ ‘మాత్రమే’ అనే పదాన్ని ఉపయోగించి, సరైన విధానాలను పాటించడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మన డబ్బు సురక్షితంగా ఉంటుంది.