- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . .


కొత్త ఏడాదిలో హైదరాబాద్ రియాలిటీ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయన్న సిగ్న‌ల్స్ అయితే స్ప‌ష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త ఏడాది లో రిజిస్ట్రేషన్ల జోరు కనిపిస్తోందని హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్‌ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది అనేక‌ కారణాలతో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ మంద‌గించిన మాట వాస్త‌వం. చాలా మంది ధ‌నిక వ‌ర్గాలు సైతం ఇళ్లు కొనుగోలు వైపు ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు ప్రజలు కొత్త ఏడాదిలో తమ మనసు మార్చుకుంటున్న‌ట్టు ట్రేడ్ చెపుతోంది.


ఇక హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రం రోజు రోజుకు ఎలా విస్త‌రిస్తుందో ?  చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలో నే  హైదరాబాద్ లో డిమాండ్ కు తగినట్లుగా ఇళ్లు నిర్మాణం లో ఉన్నాయి. పెరిగే డిమాండ్ కు తగ్గట్లుగా ప్రాజెక్టు లు కూడా నిర్మాణ ద‌శ‌ల‌ లో ఉన్నాయి. ఈ క్రమంలో ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం లేదంటున్నారు. ఇక పలువురు బిల్డర్లు మధ్య తరగతి ఆశల ను తీర్చేందుకు డబుల్ . . త్రిబుల్ బెడ్ రూం ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాస్త త‌మ‌కు అందు బాటు లో ఉండే రేంజ్ లో నే ఈ కొనుగోళ్ల కు ఎంక్వైరీలు న‌డుస్తున్నాయ‌ట‌.


గత పది రోజులుగా రియల్ ఎస్టేట్ కార్యాలయాలకు ఎంక్వయిరీలు .. విచార‌ణ‌లు పెరుగుతున్నాయ‌ని కూడా రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక చిన్న చిన్న మేస్త్రీ లు క‌ట్టే ఇళ్ల కోసం వాక‌బు చేస్తోన్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోందంటున్నారు. గ‌తేడాది వ‌చ్చి ప‌డిన స‌మ‌స్య‌ల్లో ఒక‌టి అయినా హైడ్రా కూడా పూర్తిగా భ‌రోసా ఇస్తోంది. ఏదేమైనా చిన్న చిన్న ఇళ్ల కొనుగోళ్ల విష‌యంలో ఇప్పుడు హైద‌రాబాదీ లు పూర్తి అభిరుచితో ఉన్నార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: