టూత్ బ్రష్... ఈరోజుల్లో టూత్ బ్రష్ వాడని వారు అంటూ ఎవరూ ఉండరనే చెప్పుకోవాలి. మనిషి తొలినాళ్లలో వివిధ రకాల చెట్లక్లు సంబందించిన కొమ్మలను విరిచి దంతాలు క్లీన్ చేసుకొనేవారు. అయితే కాలక్రమేణా నాగరికత పెరగడంతో మనిషిలో కూడా చాలా మార్పులు వచ్చాయి. దాంతో పుల్లల ప్లేసులో టూత్ బ్రష్ వచ్చి చేరింది. ఇది చాలా సౌకర్యవంతంగా ఉండడంతో నేడు దాదాపుగా అందరూ వీటి సాయంతోనే తమ పళ్ళను శుభ్రపరుకుంటారు. మానవ శరీరంలో దంతాల నిర్మాణం చాలా ప్రత్యేకమైనది. మనిషి దేనినైనా నమిలి మింగాలంటే దంతాలు బలిష్టంగా ఉండడం తప్పనిసరి. మరోవైపు మనిషి చిరునవ్వుకు దంతాలు ఎంతో అందాన్ని తెచ్చి పెడతాయి. ఈ క్రమంలోనే టూత్ బ్రష్ అనేది బాగా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్నో కంపెనీలు టూత్ బ్రష్ లను తయారు చేస్తున్నాయి. ఇక మనం ప్రతిరోజూ వాడే టూత్ బ్రష్ ఎలా తయారవుతుందో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటివారికోసమే ఈ న్యూస్. సాధారణంగా ఓ రకమైన ఆటోమేటెడ్ మెషిన్లో లిక్విడ్ ప్లాస్టిక్ ని పంపడం ద్వారా టూత్ బ్రష్ లు క్షణాల్లోనే తయారవుతున్నాయి. అయితే వీటిని ప్యాక్ చేసేందుకు మాత్రం మనుషుల అవసరం తప్పనిసరి. ఇలా తయారు కాబడిన టూత్ బ్రష్ లు మార్కెట్లోని దుకాణాలకు డీలర్స్ ద్వారా సరఫరా చేస్తారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం.

అయితే టూత్ బ్రష్ లు వాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. మనలో చాలామంది ఎక్కువ సేపు టూత్ బ్రష్ వాడుతూ ఉంటారు. అలా వాడడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే దంతాలపై ఉన్న ఎనామిల్ అనేది కనుమరుగయ్యి పసుపు రంగులో కనబడతాయి. అంతేకాకుండా మరికొంతమంది బ్రష్‌లు విరిగిపోయే వరకు వాడుతుంటారు. అలా మీరు చేస్తే, జాగ్రత్త వహించండి. ఒకే టూత్‌బ్రష్‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల దంతాలు అనేక రకాల సమస్యలకు గురవుతాయని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన దంతాల కోసం ప్రతి ఒక్కరూ ప్రతి 2 నుండి 3 నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చుకోవాలి. బ్రష్ విరిగిపోయే వరకు లేదా ముళ్ళరిగే వరకు వేచి ఉండడం చాలా తప్పు!

మరింత సమాచారం తెలుసుకోండి: