ఏంటి.. నిజామా? మాలో చాలామందికి లవ్ బ్రేకప్ అయిందిగా! అయితే ఉద్యోగాలు ఇస్తారా? అనే ఆలోచనలు అపుడే మీలో మొదలయ్యాయి కదూ. అయితే ఇక్కడ కొన్ని షరతులు వర్తిస్తాయి మరి. ఇంతకీ ఈ అరుదైన అవకాశం ఎక్కడంటే? బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ తాజాగా ఇటువంటి ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. విద్యార్హతతో సంబంధం లేకుండా లవ్ బ్రేకప్ అయిన వారికి మాత్రమే ఉద్యోగం ఇస్తామంటూ "మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ" ప్రకటించింది. దానికోసం 'చీఫ్ డేటింగ్ ఆఫీసర్' కోసం ఏకంగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

సదరు నోటిఫికేషన్లో దానికోసం కొన్ని నియమ నిబంధలను కూడా పేర్కొంది. ప్రేమ, ఆన్‌లైన్ డేటింగ్ వంటి వాటిలో మంచి నైపుణ్యం కలిగి ఉండాలని, కనీసం ఒక్కసారైనా బ్రేకప్, 2 సిట్యుయేషన్‌షిప్‌లు, 3 డేట్‌లు వంటివి ఉండాలని నిబంధనలు పెట్టడం కొసమెరుపు. ఇలాంటి వారు మాత్రమే సదరు ఉద్యోగానికి అర్హులని స్పష్టం చేసింది.⁠⁠ అదేవిధంగా కొత్త డేటింగ్ నిబంధనల సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. కొత్త వాటిని సృష్టించడానికి కూడా తగినంత ధైర్యం కలిగి ఉండాలి అని రాసుకొచ్చారు. అదేవిధంగా ⁠⁠కనీసం 2-3 డేటింగ్ యాప్‌లను ప్రయత్నించి ఉండాలని కూడా నిబంధన ఉంది. అయితే ఇక్కడ క్యాట్‌ఫిషింగ్‌కు తావులేదని స్పష్టం చేసింది.

అవసరమైన లవ్ ఇంటెలిజెన్స్ ఉన్నవారు.. సదరు ఉద్యోగానికి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చని సంస్థ రాసుకొచ్చింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, సదరు జాబ్ కోసం ఇంకా ఎటువంటి ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ అవసరం లేదని పేర్కొంది. అంటే అక్కడ జాబ్ చేయడానికి ప్రత్యేకంగా ఎంబీఏ, ఎంసీఏ వంటివి అవసరం లేదు. అంతేకాదండోయ్.. ఉద్యోగానుభవం అంతకంటే అవసరం లేదు. ప్రేమ పిపాసులై, ప్రేమ భాషలో నిష్ణాతులైన వారు ఎవ్వరైనా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చన్నమాట. అయితే జీతం గురించి మాత్రం ఇంకా ఎటువంటి వివరాలను సంస్థ వెల్లడించలేదు. దాంతో ఈ జాబ్ పోస్ట్ జనాలను ఆశ్చర్యపరుస్తోంది. జాబ్ ఇచ్చేవాళ్లు విద్యార్హత చూస్తారు.. లేదా స్కిల్స్ చూస్తారు. కానీ ఈ కంపెనీ మాత్రం దీనికి భిన్నమైన రూల్స్ పెట్టింది ఏమిటబ్బా! అని ఆశ్చర్యపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: