నేటి మన దైనందిత జీవితంలో ఎన్నో బ్రాండెడ్ వస్తువులు కొని వాడేస్తూ పారేస్తూ ఉంటాం. కానీ మనలో చాలామందికి ఆయా కంపెనీల పూర్తి పేర్లేమిటో బొత్తిగా తెలిసి ఉండదు. యువత గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. అప్పు చేసైనా సరే బ్రాండెడ్ వస్తువులను కొనివ్వాలని తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనం ఎన్నో బ్రాండెడ్ వస్తువులను ప్రతిరోజు వాడుతున్నప్పటికీ మనకు కనీసం ఆ సంస్థల ఫుల్ ఫాం కూడా తెలియదు. అలా ఎలుసుకోవాలని కూడా ఎవరూ ట్రై చేయరు. అయితే అరుదుగా అతి తక్కువమంది మాత్రం వాటి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటారు. అలాంటివారికోసమే ఈ కధనం. మరీ ముఖ్యంగా ఇక్కడ సో కాల్డ్ వివిధ కంపెనీల ఫుల్ ఫాంలను తెలుసుకుందాం పదండి!

1. BSA - ఫుల్ ఫాం ‘బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్’ కంపెనీ లిమిటెడ్. 1861లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం బర్మింగ్‌హామ్ లో ఉంది.

2. Amul: ‘ఆనంద్ మిల్క్ ఫెడరేషన్ యూనిట్ లిమిటెడ్’.. 1946లో స్థాపించారు.

3. BMW: ‘బవేరియన్ మోటార్ వర్క్స్’. ఈ కార్లంటే యువతకి చెప్పలేని మోజు.

4. HTC: ‘హై టెక్ కంప్యూటర్స్’… తైవానీస్ కంపెనీ.

5. HDFC: ‘హౌసింగ్ డెవెలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్’. హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ 1994లో రిజిస్ట్రర్ చేయబడింది.

6. AND: ఫుల్ ఫాం ‘అనితా డోంగ్రీ’… దుస్తుల కంపెనీ.

7. BPL: ‘బ్రిటిష్ ఫిజికల్ ల్యాబొరేటరీస్’.. టెలివిజన్ బ్రాండ్.

8. ESPN: ‘‘ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ స్పోర్ట్స్ ప్రొగ్రామింగ్ నెట్వర్క్’’.. క్రీడల టీవీ ఛానెల్.

9. IBM: ‘ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్’ 1911 జూన్ 16న స్థాపించారు.

10: ICICI: ‘ఇండస్ట్రియల్ క్రెటిట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’. 1994లో స్థాపించారు.

11. ITC: ‘ఇండియన్ టొమాకో కంపెనీ’… మొదట దీనిపేరు ‘ఇంపెరియల్ టొబాకో కంపెనీ’గా ఉండేది.

12. INTEL: పూర్తి పేరు ‘ఇంటెగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్’.

13. JBL: ‘జేమ్స్ బుల్లాఫ్ లాన్సింగ్’..

14. IRCTC: ‘ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్’.. భారతీయ రైల్వే సంస్థ.

15. LG: ‘లక్కీ గోల్డ్ స్టార్’… బహుళజాతి ఎలక్ట్రానిక్స్ సంస్థ.

16. MRF: ‘రబ్బర్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ’.. ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది.

17. DLF: 'ఢిల్లీ ల్యాండ్, ఫైనాన్స్.' సీహెచ్ రాఘవేంద్ర 1946లో దీనిని స్థాపించారు.

18. ADIDAS: సంస్థ వ్యవస్థాపకుడు ‘అడాల్ఫ్ దస్లెర్’ పేరు సంక్షిప్త నామమే అడిడస్.

19. H&M: ‘హెన్నీస్&మౌరిట్జ్’. స్వీడన్ ఫ్యాషన్ దుస్తుల సంస్థ.

20. WIPRO: ‘వెస్ట్రన్ ఇండియా ప్రొడక్ట్స్ లిమిటెడ్’.. గతంలో ‘వెస్ట్రన్ ఇండియా పాం రిఫైండ్ ఆయిల్ లిమిటెడ్’ గా ఉండేది.

21. HCL: ‘హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్’… శివ నాడార్ 1976, ఆగస్టు 11న స్థాపించారు.

22. HMT: ‘హిందుస్థాన్ మిషన్ టూల్స్’… 1953లో సంస్థను స్థాపించారు.

23. NTV: ‘న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్’.. ప్రనోయ్ రాయ్, రాధిక దీన్ని 1988 లో స్థాపించారు.

24. PVR: ‘ప్రియా విలేజ్ రోడ్ షో’ అతి పెద్ద మల్టీప్లెక్స్ సినిమా చైన్స్ సంస్థ.

25. TVS: ‘టి.వి. సుందరం’ అయ్యంగర్ దీన్ని స్థాపించారు. మోటార్ కంపెనీగా కొనసాగుతోంది.

26. VODAFONE: ‘వాయిస్ డేటా అండ్ ఫొన్’.. 1991లో స్థాపించారు.

27. SYSKA: శ్రీ యోగి సంత్ కృపా అనంత్
28. PAYTM: పే థ్రూ మొబైల్

గమనిక: మీకు ఇంకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: