![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/business/technology_videos/jioa48ba26b-7242-4ece-996d-dc03bc8bee95-415x250.jpg)
ఇక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వివరాల విషయానికొస్తే...
ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ రూ.149 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మొబైల్ ప్లాన్ (యాడ్- సపోర్టెడ్ ప్లాన్) ప్రారంభ ధర రూ.149 ఉండగా 3 నెలల కాల వ్యవధి వ్యాలిడిటీని కలిగి ఉంది. ఇక ఏడాది ప్లాన్ చూస్తే వ్యాలిడిటీ ధర రూ.499గా నిర్ణయించారు. ఈ ప్లాన్ల ద్వారా కేవలం ఒక మొబైల్‌లో మాత్రమే కంటెంట్ చూసే అవకాశం ఉంటుంది. రెండు డివైజ్‌లకు సపోర్ట్ చేసేలా 2 ప్లాన్లను (యాడ్- సపోర్టెడ్ ప్లాన్) జియోహాట్‌స్టార్ తీసుకురావడం గమనార్హం. ఇక 3 నెలల వ్యాలిడిటీతో అందుబాటులోకి తెచ్చిన ఈ ప్లాన్ ధర రూ.299 కాగా, ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.899గా ఉంది.
గమనిక: యాడ్స్ లేకుండా కంటెంట్ చూడాలనుకుంటే జియోహాట్‌స్టార్ 2 ప్రీమియం ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ నెలకు రూ.299తో స్టార్ట్ అవుతోంది. 3 నెలల వ్యాలిడిటీ కలిగిన ప్రీమియం ప్లాన్ ధర రూ.499 ఉండగా, ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.1499 గా ఉంది. ఈ ప్రీమియం ప్లాన్లతో 4 డివైజ్‌ల వరకు కంటెంట్‌ను వీక్షించే వెసులుబాటు కలదు.
ఇకపోతే జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ కలిపి జియో హాట్‌స్టార్‌గా అవతరించిన సంగతి విదితమే. ప్రస్తుతం హాట్‌స్టార్ యాప్‌ను వినియోగిస్తున్న వారు, యాప్ అప్‌డేట్ చేసుకుంటే అది జియో హాట్‌స్టార్‌గా రూపాంతరం చెందుతుంది. ఇప్పటికే మీరు హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఉంటే రాబోయే 3 నెలల పాటు వారికి పాత రేట్లే కొనసాగనున్నాయని సమాచారం. ఒకవేళ జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఉంటే వారు ఆటోమేటిక్‌గా జియోహాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌కు మారుతారనే విషయం గమనించగలరు.