
ఇక్కడ ముందుగా మీరు ప్రధాన కార్ ఇన్సూరెన్స్ కవరేజీల గురించి తెలుసుకోవాలి. అందులో ఒకటి.. "థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్." ఇది ఎంచుకొన్నపుడు వాహనదారుడు గాయాలు పాలైనా కారు డామేజ్ అయినా కవరేజ్ లభిస్తుంది. ఇందులో రెండవది.. "కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్." దీనిని ఎంచుకోవడం ద్వారా మీ వాహనానికి ప్రమాదాలు జరిగినా, దొంగతనం జరిగినా, అగ్ని మరియు ప్రకృతి వైపరీత్యాలు వల్ల కలిగే నష్టాలకు ఇది రక్షణ కల్పిస్తుంది. ఇక మూడవది.. "స్టాండెలోన్ ఓన్ డామేజ్ ఇన్సూరెన్స్". మీ వాహనానికి జరిగే నష్టాలను ఇది కవర్ చేస్తుంది కానీ మొదటి రెండు ఇన్సూరెన్స్ కవరేజీల వలన కలిగే ఉపయోగాలు దీని వలన ఉండవనే చెప్పుకోవాలి. అందుకే సాధారణంగా దీనిని తృతీయ పక్ష ఇన్సూరెన్స్ (థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్)తో పాటు తీసుకుంటారు.
అయితే కార్ ఇన్సూరెన్స్ లో ఈ 4 యాడ్ ఆన్లు చేసుకోవడం వలన మీ పాలసీ కవర్‌ను మరింత మెరుగుపరుస్తాయి అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదని నిపుణులు చెబుతున్నారు.
ప్రాచుర్యం పొందిన యాడ్-ఆన్లలో ఇవి కొన్ని:
1. జీరో డిప్రెసియేషన్: జీరో డిప్రెసియేషన్ వలన ఫుల్ క్లెయిమ్ అందుతుంది.
2. రోడ్సైడ్ అసిస్టెన్స్: బ్రేక్‌డౌన్‌లు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఇది సహాయం అందిస్తుంది. ఉదాహరణకు.. బ్రేక్ డౌన్ అయినా, ఫ్యూయల్ అయిపోయినా, బ్యాటరీ మొదలగు సర్వీసులు అందిస్తారు.
3. ఇంజిన్ ప్రొటెక్షన్: నీరు ప్రవేశించడం లేదా ఆయిల్ లీకేజ్ వల్ల ఇంజిన్‌కు కలిగే నష్టాలను ఇది కవర్ చేస్తుంది.
4. కాంజ్యుమబుల్ కవరేజీ: రిపేర్ సమయంలో ఇంజిన్ ఆయిల్, బోల్ట్స్, నట్స్, బ్రేక్ ఆయిల్ వంటి వాటికి ఇది ఉపకరిస్తుంది.