బంగారం అనేది అత్యంత విలువైన కనిజాలలో ఒకటి అనే విషయం మన అందరికీ తెలిసిందే . దానితో అనేక దేశాలు ఎప్పుడూ ఆర్థిక సమస్య తలెత్తున బంగారం ద్వారా తమ సమస్యలు తీరుతా యి అని ఉద్దేశంతో తమ వద్ద ఎక్కువ శాతం బంగారాన్ని కొని ఉంచుకుంటున్నా రు . అలాగే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒడిదుడుకు ల ఎదుర్కొంటూ ఉండడంతో బంగారం పై పెట్టుబడి పెడితే తమ డబ్బు చాలా వరకు సేఫ్ గా ఉంటుంది అని ఉద్దేశంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది తమ డబ్బును బంగారంపై పెట్టుబడులు పెడుతు న్నారు.

ఇక మన భారతదేశ విషయానికి వస్తే భారత దేశంలో బంగారాన్ని ఒక పెట్టుబడి మార్గంగా మాత్రమే కాకుండా సమాజంలో గుర్తింపు కోసం కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. భారతీయులు తమ ఇంట్లో పెళ్లిళ్లు జరిగినట్లయితే పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే ఇతర శుభకార్యాలకు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉండడంతో బంగారం ధరలు ఎప్పుడు ఎంతో కొంత శాతం పెరుగుతూనే వస్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం అమెరికా , చైనా మధ్య ఆర్థిక పోరు జరుగుతూ ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదిలైపోయాయి.

దానితో పెట్టుబడిదారులంతా స్టాక్ మార్కెట్ కంటే బంగారంపై పెట్టుబడి ఎంతో మంచిది అంటూ బంగారం పై పెట్టుబడి పెడుతున్నందున ఒక్క సారిగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రస్తుతం బంగారం ధర ఒక గ్రామ్ 24 క్యారెట్స్ 94 వేల రూపాయలు కొనసాగుతుంది. ఇక ఇది లక్ష రూపాయలకు కూడా చేరే అవకాశాలు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఇలా బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: