కాకరకాయ అనే మాట వింటేనే చాలు, చాలామంది అమ్మో చేదు అని అంటుంటారు. కాని కాకరకాయ తింటే ఎంతో మంచిదని చాలా మందికి తెలీదు.కాకరకాయ లోని చేదు మదుమేహాం సమస్యలను,కీళ్ళ నొప్పులను తగిస్తుంది.కాకరకాయ రసాన్ని కీళ్ళ నొప్పులు ఉన్న చోట మనం మర్ధన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు .కాకరకాయను మనం చాలా విధాలుగా చేసుకోవచ్చు. కూరలాగ, పులుసులాగ, కారం లాగా, ఫ్రై లాగా, పకోడి లాగా,చిప్స్ లాగా  మరెన్నో రకాలు చేసుకోవచ్చు.ఇప్పుడు మనం "స్టఫ్డ్ కాకరకాయ మసాలా కారం" ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

"స్టఫ్డ్ కాకరకాయ మసాలా కారం" తయారు చేయడానికి కావాల్సిన పథార్ధాలు:

 కాకరకాయలు-1/2 kg ,       

ఎండు కొబ్బరి ముక్కలు-కొద్దిగ ,

 వెల్లుల్లి రెమ్మలు-కొన్ని ,        

పల్లీలు -కొద్దిగ ,

ధనియాలు -కొద్దిగ ,         

జిలకర్ర - 2 టేబుల్ స్పూన్స్ , 

 ఉప్పు-తగినంత ,        

 కారం-తగినంత , 

 తాలింపు దినుసులు -2 టేబుల్ స్పూన్స్ ,

  కరివేపాకు -కొద్దిగ ,   

      పసుపు-కొద్దిగ ,     

   ఆయిల్-డీప్ ఫ్రై కి సరిపడా ,

"స్టఫ్డ్ కాకరకాయ మసాలా కారం" తయారు చేసే విధానం:


ముందుగా కాకరకాయలపైన ఉన్న చెక్కును తీసి,వాటిని మధ్యలోకి కట్ చేసుకోని లొపల ఉన్న గింజలు తీసేసి కొద్దిగ ఉప్పు,పసుపు వేసి  బాగా పట్టేలాగా కలుపుకుని కాసేపు పక్కన పెటుకుని ఉంచుకోవాలి.ఇలా చేయడం వల్ల కాకరకాయలోని చేదు పోతుంది.


కాకరకాయలోకి స్టఫ్ చేసుకోటానికి కావాల్సిన మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక దాంట్లో కొద్దిగ ధనియాలు,జిలకర్ర,ఎండు కొబ్బరి,పల్లీలు వేసుకుని కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత వీటిని మిక్సీ జారులో వేసి కొద్దిగ కారం,వెల్లులి రెమ్మలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

    

 ఇప్పుడు ముందుగా కట్ట్ చేసి పసుపు ఉప్పు కలిపి పెటుకున్న కాకరకాయలోని నీళ్ళను పిండేయ్యాలి.స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం వేడయ్యాక డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ట్ చేసిన కాకరకాయలను వేయించుకోవాలి .ఇలా వేయించిన కాకరకాయలను ఒక ప్లేట్ లోకి తీసుకుని ముందుగా తయారు చేసుకున్న మసాలా కారాన్ని ఈ కాకరకాయలో స్టఫ్ చేసుకుని ఉంచుకోవాలి.


మళ్లీ  స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టీ అందులో కొద్దిగ ఆయిల్ వేయాలి.ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు,కరివేపాకు వేసుకోవాలి అవి వేగిన తరువాత ఎండు మిర్చీ వేసుకుని స్టఫ్ చేసిన కాకరకాయలను కూడా వేసి ఇంకొంచెం వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన కారాన్ని ప్యాన్ లో వేసి బాగా కలిపి మూత పేట్టి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. అంతే ఎంతో రుచికరమైన నొరూరించే "స్టఫ్డ్ కాకరకాయ మసాలా కారం" రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: