కావాల్సిన పదార్థాలు:
వంకాయలు- 4
రొయ్యలు- ఒక కప్పు
పచ్చి మిర్చి- 1
పసుపు- పావు టీ స్పూను
కారం- ఒక టీ స్పూను
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు- పావు కప్పు
ఉల్లిపాయ- 1
అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూను
టమోటా- 1
ఉప్పు- తగినంత
తయారీ విధానం:
ముందుగా రొయ్యలను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి.. వేడి అయ్యాక ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టును వేసి దోరగా వేయించాలి.
తర్వాత అందులో వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మూత పెట్టి స్లో ఫ్లేమ్‌పై మగ్గించాలి. ఇప్పుడు అందులోనే రొయ్యలు కలిపి మంట కొద్దిగా పెంచాలి. రొయ్యలు వేగాక కొత్తిమీర చల్లి స్టౌ అపేయాలి. అంతే ఎంతో సులువుగా వంకాయ రొయ్యల కర్రీ రెడీ. రైస్‌తో వంకాయ రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది.