కావాల్సిన పదార్థాలు:
చికెన్- అరకేజీ
గోంగూర- రెండు కప్పులు
అల్లం- చిన్నముక్క
వెల్లుల్లి రెబ్బలు- ఆరు
ఉల్లిపాయలు- రెండు
పచ్చిమిర్చి- నాలుగు
టమాటో- ఒకటి
పసుపు- అర టీస్పూన్
కారం- తగినంత
ధనియాలు- ఒక టేబుల్‌స్పూన్
గరంమసాలా- ఒక టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
మెంతులు- పావు టీస్పూన్
ఎండుమిర్చి- నాలుగు
తయారీ విధానం:
ఒక పాన్ తీసుకొని మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేగించాలి. చల్లారిన తరువాత వీటిని మిక్సీలో పొడి చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు కుక్కర్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. కాసేపయ్యాక టమాట ముక్కలు వేసి వేగించాలి. టమాట మెత్తగా ఉడికిన తరువాత చికెన్ వేసి, గరంమసాలా, కారం, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పావు కప్పు నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత గోంగూర ఆకులను శుభ్రంగా కడగాలి. మరొక పాన్‌లో నూనె వేసి వెలుల్లి రెబ్బలు, గోంగూర వేసి వేగించాలి. కొంచెం ఉప్పు, గరంమసాలా వేసి కలపాలి. నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే గోంగూర మెత్తగా, పేస్టు మాదిరిగా అవుతుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసి కలపాలి. చిన్నమంటపై మరికాస్త ఉడికించి స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే గోంగూర చికెన్ రెడీ..!