కావాల్సిన పదార్థాలు:
పెసరపప్పు- రెండు కప్పులు
పెరుగు- మూడు కప్పులు
అల్లంపేస్ట్- అర టీస్పూన్
జీలకర్ర- అర టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
చాట్ మసాలా- అర టీ స్పూన్
జీలకర్రపొడి- టీస్పూన్
కొత్తిమీర తరుగు- కొద్దిగా
ఎండుమిర్చి- మూడు
కారం- ఒక టీస్పూన్
పచ్చిమిర్చి- రెండు
నూనె- తగినంత.
తయారీ విధానం:
ముందుగా పెసరపప్పును మూడుగంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు, జీలకర్ర, ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి అన్ని ఒక జార్‌లో వేసి మిక్సీ పట్టించాలి. ఇప్పుడు స్టౌ మీద కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక పెసరపప్పు మిశ్రమాన్ని వడలుగా చేసుకొని నూనెలో వేసి డీఫ్రై చేయాలి.
ఇప్పుడు వీటిని ప్లేట్‌లోకి తీసుకోవాలి. మరో పాన్‌లో పెరుగు, జీలకర్రపొడి, చాట్‌మసాలా, కారం వేసి పోపులా వేసుకోవాలి. దీన్ని వడలపై వేసి కొత్తిమీరతో గార్నిష్‌తో చేసుకుంటే సరిపోతుంది. అంతే రుచికరమైన పెరుగువడ రెడీ. పెరుగు ఇష్టపడని వారు ఇలా చేసుకుని తింటే డియం, పొటాషియం, ప్రోటీన్లు, విటమిన్స్ కూడా శరీరానికి లభిస్తాయి.