కావాల్సిన ప‌దార్థాలు:
బటన్ మష్రుమ్- ఒక క‌ప్పు
జీడిపప్పు పేస్ట్- మూడు స్పూన్లు
ఉల్లిపాయ పేస్ట్- మూడు స్పూన్లు

 

కారం- ఒక టేబుల్ స్పూన్‌
గరం మసాలా పొడి- అర టీ స్పూన్‌
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్ స్పూన్‌

 

జీలకర్ర పొడి- ఒక టీ స్పూన్‌
పసుపు- అర‌టీ స్పూన్‌
పెరుగు- అర క‌ప్పు
కొత్తిమీర‌- కొద్దిగా

 

జీలకర్ర- అర టీస్పూన్‌
దాల్చిన చెక్క- ఒక‌టి
యాలకలు- మూడు
ఉప్పు- రుచికి సరిపడా

 

త‌యారి విధానం:
ముందుగా బటన్ మష్రుమ్ ను వేడి నీటిలో శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకలు వేసి వేగించుకోవాలి. అవి వేగాక‌ అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ వెంటనే పసుపు, జీలకర్ర పొడి, కారం, జీడిపప్పు పేస్ట్ వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు వేసి గిలకొట్టి తర్వాత, దాన్ని పాన్ లో పోసి, మొత్తం మిశ్రమాన్ని క‌లుపుకోవాలి.

 

ఒక నిముషం తర్వాత బటన్ మష్రుమ్ ను అందులో వేసి మూత పెట్టి పావుగంట సేపు చిన్న‌ మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి, సరిపడా నీళ్ళు పోసి, తక్కువ మంట మీద నీళ్లు ఇగిరే వరకూ ఉడికించుకోవాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర‌ వేసి క‌లిపిస్టై ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే కాజు మష్రుమ్ మసాల రెడీ. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: