కావాల్సిన ప‌దార్థాలు:
రొయ్యలు- అర కిలో
వెల్లుల్లి- ప‌ది రెబ్బ‌లు
ఆలివ్ ఆయిల్- పావు కప్పు

 

కారం- ఒక టీ స్పూన్‌
ఉప్పు- రుచికి స‌రిప‌డా
కొత్తిమీర‌- కొద్దిగా
నిమ్మ‌కాయ‌- ఒక‌టి

 

పుదీనా- కొద్దిగా
ప‌చ్చి మిర్చి- రెండు 
ప‌సుపు- చిటికెడు
ఎండుమిర్చి- రెండు

 

గరంమ‌సాలా- అర టీ స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- అర టీ స్పూన్‌
ఉల్లిపాయ ముక్క‌లు- ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం: ముందుగా రొయ్యల్ని తొక్క తీసి నీటితో నెమ్మదిగా.. శుభ్రంగా కడిగి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచి, ముక్కలు చేసి పెట్టుకోవాలి. త‌ర్వాత స్టై మీద పాన్ పెట్టుకుని ఆలివ్ ఆయిల్‌ను వేయాలి. నూనె కాస్త వేగిన తర్వాత సిమ్‌లో వెల్లుల్లి రెబ్బల ముక్కల్ని మ‌రియు రొయ్య‌ల‌ను విడివిడిగా వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో మ‌రికొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ‌ముక్క‌లు, ప‌చ్చి మిర్చి, ప‌సుపు వేసి వేగాంచిలి.

 

అవి వేగాక రొయ్య‌లు, వెల్లుల్లి ముక్క‌లు, ఎండు మిర్చి వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కారం, త‌గినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, గ‌రంమ‌సాలా మ‌రియు కొద్దిగా నీళ్లు పోసి ఉడ‌క‌నివ్వాలి. నీరు ఇగిరిపోయాక కొత్తిమీర, పుదీనా మ‌రియు నిమ్మ‌ర‌సం పిండి ఒక‌సారి అటు ఇటు క‌లిపి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే వెల్లుల్లి రొయ్యల కర్రీ రెడీ..! 


 

మరింత సమాచారం తెలుసుకోండి: