కావాల్సిన ప‌దార్థాలు:
క్యాబేజీ తరుగు- మూడు కప్పులు
శనగపిండి- ఒక టేబుల్‌ స్పూను
వెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూను

 

మసాలాపొడి- అర టీ స్పూను
పసుపు- చిటికెడు
కారం- ఒక‌ టీ స్పూను
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

నూనె- వేగించడానికి సరిపడా
ఉల్లితరుగు- ఒక‌ కప్పు
కరివేపాకు- అరకప్పు 

 

త‌యారీ విధానం: ముందుగా ఒక పాత్రలో శనగపిండి, వెల్లుల్లి పేస్టు, కారం, మసాలాపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులోనే క్యాబేజీ తరుగు కూడా వేసి శనగపిండి మిశ్రమం క్యాబేజీకి పట్టేట్టుగా కలపాలి. అవసరమైతే కొద్దినీటిని వాడొచ్చు. ఈ ముద్దని అరగంటపాటు నానబెట్టి తర్వాత నూనెలో పలచగా, విడివిడిగా పకోడీల్లా వేసి వేగించి, తీసి చల్లారనివ్వాలి. 

 

ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకుని నూనె వేయాలి. నూనె వేడెక్కేక త‌ల్లింపు దినుసులు మ‌రియు క‌రివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ తరుగు, కొద్దిగా ప‌సుపు వేసి వేయించుకోవాలి. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న క్యాబేజీ ప‌కోడీ వేసి కొద్దిగా ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకొని స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే వేడి వేడి క్యాబేజీ పొడి కూర‌ రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: