ఎగ్ సమోసా.. ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇంట్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఎగ్ సమోసాను ఎలా చెయ్యాలి అనేది చాలామంది తల్లులకు తెలియదు.. అలాంటి వారు అంత ఇక్కడ చదివి ఎలా చెయ్యాలి అనేది తెలుసుకొని.. ఇంట్లో పిల్లలకు సాయింత్రం స్నాక్స్ గా చేసి పెట్టండి.. ఎంతో ఇష్టంగా ఈ స్నాక్స్ ను వాళ్ళు తినేస్తారు. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

గుడ్డు - 1, 

 

ఉల్లిపాయ - 1,

 

ఉడికించిన బఠాని గింజలు - 1కప్పు,

 

మైదా పిండి -250 గ్రాములు,

 

నీళ్లు - 1కప్పు, 

 

ఉప్పు- సరిపడేంత,

 

పచ్చిమిర్చి - 2,

 

నూనె - సగం కప్పు, 

 

నెయ్యి - టేబుల్ స్పూన్,

 

కొత్తమీర - తగినంత 

 

తయారీ విధానం...  

 

గిన్నెలోకి గుడ్డును తీసుకుని అందులో తగినన్ని చల్లటి నీళ్లు తగినంత ఉప్పు వేయాలి. ఆ మిశ్రమంలో పండిని వేసి మెత్తగా కలుపుకోవాలి, అలా కలగలిపిన పిండిని 20 నిమిషాలు పాటు పక్కన ఉంచాలి. సమోసాలో నింపేందుకు కావల్సిన ఉల్లిముక్కలు, బఠానీ గింజలు, పచ్చిమర్చి ముక్కలు, పోదినాను తగినంత ఉప్పుతో కలగలుపుకోవాలి. అలా తయారైన మిశ్రమాన్ని వేరుగా పెట్టుకోవాలి. 

 

ఆరబెట్టిన పిండిని త్రికోణ ఆకృతిలో కత్తిరించుకుని, అందులో ఉల్లి తదితరాలతో కలుపుకన్న మిశ్రమాన్ని నింపండి. ఒక గోలంలో  నూనె వేడిక్కిన తరువాత తయారు చేసిన సమోసాలను నూనెలో వేసి బాగా వేయించాలి. అంతే వేడి వేడి అద్భుతమైన సమోసా రెడీ.. ఈ సమోసాలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: