
పొటాటో వెడ్జెస్.. నిజంగా తింటే ఆహా అనకుండా ఉండలేరు. అంత రుచిగా ఉంటాయి మరి. అలాంటి రుచి కేవలం అంటే కేవలం మరెక్కడా ఉండదు అంటే నమ్మండి. పొటాటో వెడ్జెస్ అంత రుచిగా ఉంటాయి మరి. అలాంటి రుచికరమైన పొటాటో వెడ్జెస్ ఈవెనింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్ గా పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. అలాంటి రుచికరమైన పొటాటో వెడ్జెస్ ని ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
కావలసిన పదార్ధాలు..
బంగాళాదుంపలు - మూడు,
మైదా - అరకప్పు,
ఎండుమిర్చి గింజలు - చెంచా,
కసూరీమేథీ - అరచెంచా,
చాట్‌మసాలా - ముప్పావు చెంచా,
ఉప్పు - తగినంత,
నూనె - వేయించేందుకు సరిపడేంత.
తయారీ విధానం...
బంగాళా దుంపల్ని కడిగి వాటిని తుడిచి పొడవాటి ముక్కల్లా కోసుకోవాలి. ఓ గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని అరచెంచా ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టాలి. నీళ్లు మరిగాక బంగాళాదుంప ముక్కల్ని వేయాలి. అవి ముప్పావు వంతు ఉడికాక దింపేసి నీళ్లు పడేయాలి. ఆ నీళ్లు పడేసి ఇప్పుడు ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని కలపాలి. అందులో బంగాళాదుంప ముక్కల్ని ముంచి.. కాగుతోన్న నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. కావాలనుకుంటే పైన కొద్దిగా ఉప్పు చల్లుకొని తింటే ఎంతో రుచ్చికరంగా ఉంటాయి. ఈ పొటాటో వెడ్జెస్ ను పిల్లలకు సాయింత్రం సమయంలో స్నాక్స్ గా పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.