కావాల్సిన పదార్థాలు:
బెండకాయలు- పావు కేజి
టమాటా- ఒకటి
పసుపు- చిటికెడు
ఎండుమిర్చి- రెండు
పచ్చిమిర్చి- ఎనిమిది
ఉల్లిపాయ- ఒకటి
కరివేపాకు- నాలుగు రెబ్బలు
నూనె- తగినంత
చింతపండు గుజ్జు- ఒక టీ స్పూను
ఉప్పు- రుచికి తగినంత
జీలకర్ర- పావు టీ స్పూన్
ఆవాలు- పావు టీ స్పూన్
శెనగపప్పు- ఒక టీ స్పూన్
తయారీ విధానం: ముందుగా బెండకాయలు, టమాటా, పచ్చిమిర్చి ముక్కలుగా శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని తరిగి అరకప్పు నీటిలో ఉడికించాలి. ఇప్పుడు దాన్ని చల్లారనిచ్చి మిర్చి విడిగా తీసి పసుపు, చింతపండు గుజ్జు, ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బాలి. అందులోనే ఉల్లి తరుగు వేసి కచ్చాపచ్చాగా నూరి ఆ తర్వాత ఉడికించిన బెండ, టమాటా ముక్కలు నీరు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి.. కాగాక ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో ముందుగా రుబ్బుకున్న పేస్ట్ కలిపి స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ బెండకాయ పచ్చడి రెడీ. వేడి వేడి రైస్‌లో బెండకాయ పచ్చడి వేసుకుని తింటే వారెవ్వా అనాల్సిందే.