కావాల్సిన పదార్థాలు:
మటన్- అన కేజీ
ఉల్లిపాయ తరుగు- ఒక కప్పు
పెరుగు- రెండు టీ స్పూన్లు
నీళ్లు- తగినంత
ధనియాల పొడి- ఒక టీ స్పూన్
కారం- ఒకటిన్నర టీ స్పూన్
నూనె- తగినంత
దాల్చినచెక్క- చిన్న మూక్క
అల్లం వెల్లుల్లి పేస్టు- ఒకటిన్నర టీ స్పూన్
వేగించిన ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు
కొత్తమీర- ఒక కట్ట
పుదీనా తరగు- అర కప్పు
ఉప్పు- రుచికి సరిపడా
లవంగాలు- మూడు
యాలకలు- రెండు
తయారీ విధానం: ముందుగా మటన్‌ను నీటి సాయంతో శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగిన తరువాత శుభ్రం చేసిన మటన్, పెరుగు, ఉప్పు, కొద్దిగా నీళ్లు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి.
కొద్దీ సేపు మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు వేసి సన్నటి మంటపై అరగంట ఉడికించాలి.
తరువాత వేగించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మటన్ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. మటన్ బాగా ఉడికాక చివరిగా కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్ అఫ్ చేస్తే సరిపోతుంది. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ కుర్మా రెడీ అయినట్లే. దీనిని చపాతీ, రోటీలో ఎందులో తిన్నా చాలా అదరహో అనాల్సిందే. ఇక మటన్ విషయానికి వస్తే.. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.
శరీరానికి అవసరమయ్యే పోషకవిలువలు మటన్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి పౌష్టికాహారం. ముఖ్యంగా మటన్ లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు,దంతాలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ వాటిని దృఢంగా చేస్తుంది. మరియు ఇందులో ప్రొటీన్లు, న్యూట్రియంట్లు, బి12 బాగా ఉండడం వల్ల కొవ్వును కరిగించే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది. కాబట్టి, మటన్‌ను ఈ డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఎప్పుడూ ఒకే రెసిపీ తింటే చాలా బోర్ కొడుతుంది కాబట్టి.. పైన చెప్పినట్టు మటన్ కుర్మా ట్రై చేయండి.