కావాల్సిన ప‌దార్థాలు:
అరటి పువ్వు- ఒక‌టి
ఉల్లిపాయ త‌రుగు- ఒక క‌ప్పు
పచ్చిమిరప కాయలు- మూడు
సెనగ పప్పు- ఒక క‌ప్పు

 

ఎండు మిరపకాయలు- రెండు
కరివేపాకు- నాలుగు రెబ్బ‌లు
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

జీలకర్ర- ఒక టీ స్పూన్‌
వెల్లుల్లి- ఆరు
నూనె- వేయించ‌డానికి స‌రిప‌డా
కొత్తిమీర- ఒక క‌ట్ట‌

 

త‌యారీ విధానం:
ముందుగా సెనగ పప్పును నీటిలో రాత్రంతా నాన‌బెట్టుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అరటి పువ్వును శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే మ‌రోవైపు మిక్సీలో సెనగపప్పు, తరిగిన ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసి అన్నిటినీ పేస్టులా మిక్సీపట్టండి.

IHG

ఇప్పుడు ఓ బౌల్ తీసుకుని.. అందులో రుబ్బిపెట్టుకున్న పేస్ట్‌, క‌ట్ చేసి పెట్టుకున్ని అరటి పువ్వు త‌రుగు వేసుకుని క‌లుపుకోవాలి. ఆ త‌ర్వాత  ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బ‌లు, జీలకర్ర, కొత్తిమీర మ‌రియు రుచికి స‌రిప‌డా ఉప్పు వేసుకుని బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె పోయాలి. 

IHG

త‌ర్వాత ముందుగా క‌లుపుకున్న పిండి మిశ్రమాన్ని తీసుకుని వడ ఆకారంలో చేతిమీద అద్దుకోండి. నూనె మరిగాక.. అరటిపువ్వు వడ మిశ్రమాన్ని నూనెలో వేసి బంగారు రంగులోకి మారేవరకూ వేయించండి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన అరటిపువ్వు వడ రెడీ అయిన‌ట్లే. సో.. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: